ప్రపంచవ్యాప్తంగా నీటి తర్వాత అత్యంత ఇష్టపడే పానీయం టీ
అయితే ఇప్పుడు టీ ఎక్కువగా తాగే టాప్ 5 దేశాలు ఏంటో చూద్దాం
ఓ సర్వే ప్రకారం, టర్కిష్ ప్రజలు ఎక్కువగా టీ తాగుతారు. దాదాపు 90 శాతం మంది టీ తీసుకుంటారు.
కెన్యా, పాకిస్థాన్ రెండవ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు దేశాలకు చెందిన 83 శాతం మంది టీ వినియోగిస్తున్నారు.
మొరాకో మూడవ స్థానంలో ఉంది, ఇక్కడ 80 శాతం మంది ప్రజలు టీ తీసుకుంటారు.
భారత్ లో 72 శాతానికి పైగా ప్రజలు టీ తీసుకుంటారు.
టీ వినియోగంలో ఐర్లాండ్ నాల్గవ స్థానంలో ఉంది. ఈ దేశంలో 69 శాతం మంది టీతీసుకుంటారు.
ఇంగ్లండ్ 5వ స్థానంలో ఉంది. ఇక్కడ 59 శాతం మంది టీ తీసుకుంటారు.
స్టాటిస్టా కన్స్యూమర్ ఇన్‌సైట్స్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికలు వచ్చాయి.