Video: ఇంత బద్దకమా..? ఈ మాత్రం దానికి ఆడడం దేనికి..? ఆర్సీబీ ప్లేయర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్..

మేజర్ క్రికెట్ లీగ్‌లో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌, సియాటెల్ ఆర్కాస్ మధ్య మ్యాచ్‌లో ఫిన్ అలెన్ రనౌట్‌కి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేవలం 10 బంతుల్లోనే 28 పరుగులు చేసిన ఫిన్ అలెన్..లేజీగా పరుగు పూర్తి చేసేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు.

Video: ఇంత బద్దకమా..? ఈ మాత్రం దానికి ఆడడం దేనికి..? ఆర్సీబీ ప్లేయర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్..
New Update

క్రికెట్‌లో రన్నింగ్ బిట్‌విన్‌ ది వికెట్స్‌ చాలా ఇంపార్టెంట్‌. సచిన్,ధోనీ,కోహ్లీ, రైనా.. వీళ్లంతా 20యార్డ్స్‌లో చిరుతుల్లా పరిగెడుతారు. సింగిల్ తీసే చోటా రెండు పరుగులు.. అసలు సింగిలే లేని చోటా ఒక పరుగు, రెండు పరుగులు తీయాల్సిన చోటా మూడు పరుగులు చేయడంతో వీళ్లు దిట్ట. వీళ్లు ఓ ఎండ్‌లో ఉన్నారంటే మిగిలిన అవతాలి ఎండ్‌లో ఉన్న ఆటగాడు ఎవరైనా పరిగెత్తాల్సిందే. 2008సీబీ సిరీస్‌లో సచిన్‌-గంభీర్‌ చిన్న గ్రౌండ్‌లో నాలుగు పరుగులు తీశారు. అప్పటికి కూడా కీపర్‌ దగ్గరకు బాల్‌ థ్రో అవ్వలేదు. అంత స్పీడ్‌గా ఉంటుంది సచిన్‌ రన్నింగ్‌. ఇక ధోనీ, కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా స్మార్ట్‌గా తీసే రన్స్‌ గెలుపుకు ఎంతో ఉపయోగపడతాయి.. క్రికెట్‌లో గెలుపోటములు చాలాసార్లు నిర్ణయించేది కేవలం ఒక్కపరుగేని మర్చిపోవద్దు.. అలాంటిది ఓ ఆటగాడు లేజీగా రన్‌ చేసి ఆ జట్టు కొంపముంచాడు. మేజర్ క్రికెట్ లీగ్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?
మేజర్ క్రికెట్ లీగ్‌లో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌, సియాటెల్ ఆర్కాస్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సియాటెల్ ఆర్కాస్ నిర్ణీత ఓవర్లలో 177 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్‌లో బ్యాటింగ్‌కి దిగిన శాన్ ఫ్రాన్సిస్కో సూపర్‌ హిట్టింగ్‌ చేసింది. కేవలం 3ఓవర్లలోనే 42పరుగులు చేసింది. కానీ 4వ ఓవర్‌లోనే వారికి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 10 బంతుల్లోనే 28 పరుగులు చేసిన ఫిన్ అలెన్.. రనౌట్ అయ్యాడు. లేజీగా పరుగు పూర్తి చేసేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. అతని బద్దకాన్ని గమనించిన ఫీల్డర్ మెరుపు త్రోతో వికెట్లను గిరాటెయ్యగా.. ఫిన్.. తన బ్యాట్‌ను క్రీజులో పెట్టలేకపోయాడు. బ్యాట్‌ పిచ్‌లో ఇరుక్కుపోయింది. గతంలో ఇలా లేజీగా రన్‌ అవుటైన జాబితాలో టీమిండియా డాషింగ్ ఓపెనర్‌ సెహ్వాగ్‌ కూడా ఉన్నాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఇంగ్లండ్‌ వర్సెస్‌ న్యూజిల్యాండ్‌ మ్యాచ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ బ్రేస్‌వెల్ క్రీజులోకి వచ్చి, జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. కానీ, కొద్దిసేపటికే అతని బద్ధకం కారణంగా రనౌట్ అయ్యాడు. అటు ఇదే ఏడాది మహిళల టీ20 వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఇలానే రనౌట్ అయింది. అది మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది

ఇలాంటివి ఆర్సీబీ ప్లేయర్లకే సాధ్యం భయ్యా:
లేజీగా రన్ అవుటైన ఆటగాడు ఆర్సీబీ ప్లేయర్‌ అంటూ సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ మొదలయ్యాయి. ఇలా అవుట్ అవ్వడం కేవలం వాళ్లకే మాత్రమే చెల్లుతుందంటూ ఫ్యాన్స్‌ చురకలంటిస్తున్నారు. ఇదేమైనా గల్లి క్రికెటా అని పోస్టులు పెడుతున్నారు. ఓ ఫ్రాంచైజీకి ఆడుతున్నప్పుడు ఇలా అవుట్ అవ్వడం వాళ్ల బద్దకానికి నిర్శనమని..బౌలర్‌ కష్టపడి వికెట్‌ తియ్యడం వేరు అని..ప్రత్యర్థి జట్టుకు ఫ్రీగా వికెట్ ఇవ్వడం వేరు అని మండిపడుతున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe