Visakhapatnam: విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించాలనుకున్నారు గంటా శ్రీనివాసరావు. అయితే వారిని వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేప్టటారు.
This browser does not support the video element.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ వ్యాప్తంగా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ డబ్బు రూ.241 కోట్లు అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలున్నాయి. ఈ ఆరోపణలపైనే చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలకు పిలుపునివ్వడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా తెలుగుదేశం నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
'బాబుతో నేను' పేరుతో నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నల్ల జెండాలు పట్టుకొని 'సైకో పోవాలి - సైకిల్ రావాలి', 'డౌన్ డౌన్ జగన్' అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కుట్రలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.