US strikes on Yemen: ఎర్రసముద్రంలో వార్ కొనసాగుతోంది. హౌతీ రెబెల్స్ మీద అమెరికా దాడులు చేస్తూనే ఉంది. ఇవి రోజు రోజుకూ మరింత పెరుగుతున్నాయి కూడా. శనివారం హౌతీల (Houthis) కేంద్రం మీద అమెరికా మరోసారి క్షిపణులతో దాడి చేసింది. రాజధానిలో సనాలో భారీ పేలుడు వినిపించిందని పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎర్రసముద్రం (Red Sea), గల్ఫ్ ౠఫ్ ఎడెన్‌లో యెమెన్ తీర ప్రాంతాల వైపు రావొద్దని అమెరికా జెండాలతో ఉన్న వాణిజ్య నౌకలను యూఎస్ నేవీ హెచ్చరించింది. మరో 72 గంటల పాటూ ఆ దారిలో వెళ్ళొద్దని చెప్పింది. అలా చేసిన కొద్దిసేపటికే యెమెన్ కేంద్రం మీద క్షిపణి దాడి జరిగింది.
Also Read:అయోధ్య వెళ్ళే రైళ్ళ కోసం మిగతా ట్రైన్స్ షెడ్యూల్‌లో మార్పు
హౌతీలు మరిన్ని దాడులు ఎదర్కోవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) చెప్పారు. ఇది ఇప్పటిలో ఆగేది కాదని హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తే హౌతీలను పూర్తిగా మట్టబెట్టేవరకూ అమెరికా ఊరుకోదని స్పష్టంగా తెలుస్తోంది.
గాజా పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలని కోరుతూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల పై దాడులకు తెగబడుతున్న యెమన్ హొతీ మిలిటెంట్ల పై అమెరికా , బ్రిటన్ బలగాలు ఎదురు దాడులకు దిగాయి. గురువారం రాత్రి నుంచే అమెరికా , బ్రిటన్ సైన్యాలు హోతీ నియంత్రిత ప్రాంతలపై దాడులు ప్రారంభించాయి.
అమెరికా, బ్రిటన్ బలగాలతో పాటు..
అమెరికా, బ్రిటన్ బలగాలతో పాటు ఆస్ట్రేలియా, బెహ్రయిన్, కెనడా, నెదర్లాండ్స్ సైన్యాలు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా వైట్ హౌస్ తెలిపింది. ” ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డంకులను తొలగించడానికి ఎలాంటి చర్యలను తీసుకోవడానికైనా అమెరికా సైన్యం సిద్దంగా ఉందని, వెనుకాడుగు వేసేదే లేదని ” అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఎయిర్ స్ట్రైక్..
హౌతీ స్థావరాలపై ఇప్పటికే అమెరికా తోమాహాక్ క్షిపణులను వినియోగించింది. అంతేకాకుండా గైడెడ్ మిస్సైల్ సబ్ మెరైన్ ” యూఎస్‌ఎస్ ఫ్లోరిడా” ను కూడా అమెరికా ఈ దాడుల్లో ఉపయోగించుకుంది. అంతేకాకుండా 12 కు పైగా హోతీ లక్ష్యాలపై ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. హోతీలకు సంబంధించి రాడార్ సిస్టమ్‌లు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి నిల్వ కేంద్రాలతో పాటు క్రూయిజ్ క్షిపణి నిల్వ కేంద్రాల పై కూడా దాడులు జరిపాయి.
హౌతీ నాయకుల హెచ్చరిక...
అయితే అమెరికా, బ్రిటన్ చేస్తున్న దాడులకు మూల్యం చెల్లించుకోక తప్పదని హౌతీ నాయకులు హెచ్చరిస్తున్నారు. యెమెన్ పై అమెరికా దాడికి ప్రతి సమాధానం కచ్చితంగా చెప్పి తీరుతామన్నారు. సముద్రంలో మొహరించిన అమెరికా నౌకల పై దాడి చేయడం కంటే కూడా మేము చేసే ప్రతి స్పందన చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.