UPSC chairman Manoj Soni: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవీ కాలం ముగియడానికి ఐదేళ్ల ముందు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే పదవి నుంచి వైదొలగుతున్నట్లు సోనీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మనోజ్ సోనీ దాదాపు పదిహేను రోజుల క్రితం ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆయన రాజీనామాను ఉన్నతాధికారులు ఇంకా ఆమోదించలేదని సమాచారం.
పూర్తిగా చదవండి..UPSC chairman: నకిలీ ఐఏఎస్ వ్యవహారం.. యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా!
యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోనీ రాజీనామా చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్ నెలలోనే బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేయడం గమనార్హం.
Translate this News: