Kumari Aunty Shock : కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్(Kumari Aunty Food Stall) ఎదుట నిరుద్యోగులు(Un-Employees) ఆందోళనకు దిగారు. ఇటీవల సోషల్ మీడియా(Social Media) లో తన ఫుడ్ స్టాల్ ద్వారా ఫేమస్ అయిన కుమారి అనే మహిళను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కలుస్తా అని మాట ఇచ్చారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగుల నిరసనకు దిగారు. నిరుద్యోగుల ఆందోళనతో కుమారి ఆంటీ కన్నీరు పెట్టుకున్నారు. తనకు ఇక్కడ ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదంటూ వాపోయారు.
Also Read : ఈ ఆహారాలు ఆల్కహాల్ కంటే ప్రమాదం.. దూరంగా ఉండండి
అసలేంటి జీవో 46..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) ఏప్రిల్ లో జీవో నెంబర్ 46ను తీసుకొచ్చింది. పోలీస్ రిక్రూట్‌మెంట్లో(Police Recruitment) రాష్ట్రస్థాయి పోస్టులకు జీవో 46 కారణంగా హైదరాబాద్(Hyderabad) , సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 56 శాతం పోస్టులు భర్తీ చేస్తుంది తెలంగాణ సర్కార్. మిగిలిన జిల్లాలకు 44 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ జీవో 46 ను రద్దు చేయాలనీ కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చినప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.
తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జీవో 46 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2016, 2018 నియామకాల మాదిరిగానే 2022 ఉద్యోగ ప్రకటనను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నోటిఫికేషన్లలో టీఎస్ఎస్పీ(TS SP) పోస్టులను రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ కేటగిరి కింద నియామకం జరిగేవని, ప్రస్తుతం దీనికి విరుద్ధంగా జీవో నెంబర్ 46 మారిందని, దీనివలన పెద్ద ఎత్తున మెరిట్ అభ్యర్థులు నష్టపోతున్నారని వాపోయారు.
Also Read : PM Kisan Samman Nidhi: రైతులకు అదిరిపోయే వార్త…బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు..!!