టీ20 సిరీస్ విజయానికి అదే కారణం..సూర్యకుమార్ యాదవ్!

శ్రీలంక పై జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను భారత్ క్లీన్ స్విప్ చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఫైనల్ ఓవర్ సూర్యకుమార్ యాదవ్ వేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. అయితే మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ బౌలింగ్ చేయటం పై మీడియాకు వివరించారు.

New Update
టీ20 సిరీస్ విజయానికి అదే కారణం..సూర్యకుమార్ యాదవ్!

శ్రీలంకతో జరిగిన మూడు టీ20 వ టీ20 సిరీస్ లో భారత్ సూపర్ ఓవర్లలో మరో 5 బంతులు మిగలగానే లక్ష్యాన్ని సాధించింది. మూడు టీ20 మ్యాచుల్లో విజయం సాధించి శ్రీలంకను భారత్ క్లీన్ స్పీప్ చేసింది.

పల్లెకెలెలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టాప్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌(39), రియాన్‌ పరాగ్‌ (26), వాషింగ్టన్‌ సుందర్‌ (25)లు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. దాని తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో లంకకు చిన్న లక్ష్యాన్ని ఇవ్వగలిగారు భారత బ్యాటర్లు. రెండో ఓవర్లో తీక్షణ బౌలింగ్‌లో యశస్వీ(10) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సంజు(0) మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. విక్రమసింఘె వేసిన బంతిని హసరంగకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మూడో ఓవర్లో రింకు సింగ్‌(1) తీక్షణ బౌలింగ్‌లో పతిరణకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ సూర్య(8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. తర్వాత వచ్చిన శివమ్‌ దూబె(13) సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో భారత్‌ 48 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. గిల్, పరాగ్, వాషింగ్న్ సుందర్‌లు కాస్త ఆడారు కాబట్టి ఆ మాత్రం స్కోరు అయినా సాధించగలగారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ 3, హసరంగా 2, విక్రమసింఘే, మెండిస్‌, ఫెర్నాండో ఒక్కో వికెట్‌ తీశారు

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. శ్రీలంక బ్యాటింగ్ చూసి ఎలాంటి ఒత్తిడికి గురికాలేదన్నాడు. ఏ దశలోనూ గేమ్ చేజారిపోయినట్లు ఫీలవ్వలేదని సూర్య తెలిపాడు. టీ20 ఫైనల్ మ్యాచ్
మాకు మళ్లీ గుర్తొచ్చింది. ఆఖరి ఓవర్ వరకు విజయం కోసం పోరాడాలనే విషయం తెలిసొచ్చింది. రాత్రి వేళలో పిచ్‌లు ఎలా ఉంటాయో మాకు బాగా తెలుసు. అదృష్టవశాత్తు ఎలాంటి డ్యూ లేదు. 'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. పిచ్ స్పిన్ బౌలింగ్ కు బాగా అనుకూలిస్తుందని అర్థమైయింది.అందుకే పరాగ్,రింకూ లను ఉపయోగించుకున్నాను.ఫైనల్ ఓవర్ సిరాజ్ కు ఛాన్స్ ఉన్నా తను వేయటం పై సూర్య వివరణ ఇచ్చాడు. కొత్త స్పిన్ బౌలర్ వేయాలని డిసైడ్ అయ్యా అది నేనే అయితే బాగుంటుందని అనిపించి బౌలింగ్ చేశా అని సూర్యకుమార్ తెలిపాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు