Movies:డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజుకు ఫ్యాన్స్ అదిరిపోయే గిఫ్ట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్... ఈ పేరు తెలియని వాళ్లు భారతదేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. 2002 నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన.. ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, రెబల్, మిర్చి వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో నటించాడు. ఇక ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరకక్షన్ లో బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు.

Movies:డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజుకు ఫ్యాన్స్ అదిరిపోయే గిఫ్ట్
New Update

ప్రభాస్ కెరియర్ తొలి నాళ్లలో ఆయన సినిమాలు కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. ఇప్పుడు ఆయన రేంజ్ 1500 కోట్ల వరకూ చేరిపోయింది. బాహుబలి, సాహో, ఆది పురుష్ వంటి చిత్రాలకు 1500 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టి తీసారు. అలాగే రెమ్యునరేషన్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా అన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. తెలుగు తెర దిగ్గజాల స్ఫూర్తిని, లెగసీని కొనసాగిస్తూ మన సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో ప్రభాస్. ఇవాళ ఈ పాన్ ఇండియా స్టార్, ఇండియన్ సినిమా ఛత్రపతి ప్రభాస్ పుట్టినరోజు.యమా క్రేజ్ సంపాధించుకున్న డార్లింగ్ కు 44 ఏళ్ళు.

Also Read:అది చంద్రబాబు రాసినది కాదు..జైలు అధికారి ఎస్.రాహుల్

ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా పరిచయం అయిన ప్రభాస్ సినిమా సినిమాకు నటనలో ఆత్మవిశ్వాసం, పరిణితి ప్రదర్శించాడు. మొదటి సినిమాతోనే ప్రభాస్ హీరోయిజానికి అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానం లభించింది. తరువాత వచ్చిన వర్షం ప్రభాస్ కు తొలిసారి బిగ్ కమర్షియల్ సూపర్ హిట్ ఇవ్వగా..రాజమౌళి కాంబినేషన్ లో చేసిన ఛత్రపతి మాస్ హీరోగా తిరుగులేని స్టార్ డమ్ అందించింది. డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరయ్యాడు ప్రభాస్. ‘రాఘవేంద్ర’ ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’, ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్‌’ ‘రెబల్‌’…వంటి సినిమాలన్నీ నటుడిగా ప్రభాస్ వెర్సటాలిటీ చూపిస్తాయి. మిర్చి..ఆయన కెరీర్ లో ఓ స్పెషల్ సూపర్ హిట్. బాహుబలి రెండు సినిమాల రికార్డ్ స్థాయి విజయాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్.

తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ మార్కెట్ ను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ప్రభాస్ కే దక్కుతుంది. ఏ తెలుగు హీరోకు సాధ్యం కాని రికార్డులెన్నో ప్ర‌భాస్ తిర‌గ‌రాశారు. తెలుగు సినిమాకు 2000 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించే స‌త్తా ఉంద‌ని బాహుబ‌లి -2తో ప్ర‌భాస్ నిరూపించాడు. ఓవ‌ర్‌సీస్ మార్కెట్‌లో ప‌ది మిలియ‌న్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించిన తొలి హీరో ప్ర‌భాస్‌. బాహుబలి రెండు సినిమాల తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఇక ఓన్లీ తెలుగు సినిమా చేసే స్థాయి దాటిపోయింది.

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్నవన్నీ భారీ సినిమాలే. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీద అంచనాలు భారగీగానే ఉన్నాయి. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కల్కి 2898ఏడీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా రాబోతోంది. భారీ బడ్జెట్ తో ప్రపంచస్థాయి టెక్నాలజీతో కల్కి 2898 ఏడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. వీటి తరువాత మారుతి దర్శకత్వంలో ఒకటి, టి సిరీస్ నిర్మాణంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించే స్పిరిట్ సినిమా లు లైనప్ లో ఉన్నాయి.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అతని అభిమానులు భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతి పెద్ద కటౌట్ గా ఇది రికార్డ్ సృష్టించింది. హైదరాబాద్ కుకట్ పల్లిలో 230 అడుగుల ఎత్తైన కటౌట్ పెట్టడంతో పాటూ పెద్ద ఎత్తున బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అతని సూపర్ హిట్ మూవీ ఛత్రపతిని కూడా రీరిలీజ్ చేస్తున్నారు.

#birthday #prabhas #telugu #movies
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి