TG Group-1 : తెలంగాణ గ్రూప్-1పై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు!

గ్రూప్-1 నియామకాల నిబంధనలు సవరించడంపై స్పష్టతనివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత, ప్రస్తుత నిబంధనల తేడాను వివరించాలని సూచించింది. నల్గొండ జిల్లాకు చెందిన రాంబాబు పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టింది.

author-image
By srinivas
dredr
New Update

TGPSC Group-1 : తెలంగాణలో గ్రూప్-1 నియామకాల నిబంధనలు సంవరించడంపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత నిబంధనల ప్రయోజనాలతో పోలిస్తే కొత్త నిబంధనలు అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం వేస్తాయో స్పష్టం చేయాలని సూచించింది. నిబంధనల సవరణల వల్ల గతానికి, ప్రస్తుతానికి ఉన్న తేడాను వివరించాలని ఆదేశిస్తూ రాంబాబు వేసిన కేసు పిటిషన్ విచారణను సెప్టెంబరు 25కు వాయిదా వేసింది.

1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు..

ఈ మేరకు నల్గొండ జిల్లాకు చెందిన రాంబాబు 2018, 2019లో దివ్యాంగుల రిజర్వేషన్లపై నిబంధనలను సవరిస్తూ జారీ చేసిన 10, 96, 29 జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ రాంబాబు పిటిషన్ పై జస్టిస్‌ సుజయ్‌పాల్, జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావులతోకూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. గత నిబంధనల ప్రకారం సమాంతర రిజర్వేషన్లు అమలుచేయాలని, 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు పిలవాలని రాంబాబు తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దీంతో సర్వీసు వ్యవహారాలపై సింగిల్‌ జడ్జి విచారించాల్సి ఉండగా హైకోర్డు వరకూ ఎలా వచ్చిందని ప్రశ్నించింది. చివరగా పిటిషన్ విచారణను సెప్టెంబరు 25కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

Also Read :  ఉత్తరప్రదేశ్ ఆహార కేంద్రాలకు కఠిన నియమాలు‌‌..సీఎం యోగి ఆర్డర్

 

#telangana #group-1
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి