హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉన్నాం.. హెల్త్ డిపార్ట్‌మెంట్ నియామకాలపై కీలక ప్రకటన

ఉమ్మడి రాష్ట్రంలో జీవో 1207 ద్వారా తీసుకున్న వారిని తొలగించాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. వీటికి అనుగుణంగానే ప్రభుత్వం వాదిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు.

New Update
nurse

ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్‌ ఎంపీహెచ్‌ఏ మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్ ఉద్యోగాలకు 2002లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ బట్టి విధుల్లో ఉన్న 920 మందిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అర్హతల బట్టి నియామకాలను చేపట్డంతో అప్పుడు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

మూడు నెలల్లో అర్హుల జాబితా సిద్ధం చేసి..

ఉమ్మడి రాష్ట్రంలో జీవో 1207 ద్వారా తీసుకున్న వారిని తొలగించాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. మూడు నెలల్లో అర్హులతో జాబితా సిద్ధం చేసి మళ్లీ నియామక ప్రక్రియ చేపట్టాలని తెలిపింది. దీంతో 22 ఏళ్ల నుంచి ఈ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ సాగితే...జీఓ 1207 ద్వారా తీసుకున్న చర్యలకు అనుగుణంగానే ప్రభుత్వం వాదిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు.

ఇది కూడా చూడండి:  బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

ఈ రిక్రూట్‌మెంట్‌‌కి సంబంధించి ఇప్పటికే 299 రిట్, కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు న్యాయస్థానాల్లో దాఖలయ్యాయి. ఈ కేసు విషయంలో తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి జైలుశిక్ష పడటంతో పాటు పలువురు అధికారులకు జరిమానాలు కూడా విధించారు. హైకోర్టు ఆదేశాలు వెంటనే అమలుచేయకపోతే మరిన్ని కోర్టు వివాదాలు పెరుగుతాయన్నారు.

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

920 మందిని తప్పని పరిస్థితుల్లో తొలగించగా ఇప్పటికీ వాళ్లు స్టేలతో కొనసాగుతున్నారన్నారు. 2002 నోటిఫికేషన్‌ ప్రకారం విధుల్లో చేరిన అనంతరం అర్హతలు, మెరిట్‌ జాబితాల విషయంలో సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు కొందరిని 2012లోనే విధుల నుంచి తప్పించారు. మళ్లీ వారిని 1207 జీఓ ద్వారా 2013లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారన్నారు. 

ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు