Telangana: తెలంగాణకు తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. బంగాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు జల్లులు కురుస్తాయని చెప్పారు

rains 2
New Update

Telangana: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. నేడు వాయుగుండం తుపానుగా ఏర్పడబోతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుపానుకు 'ఫెంగల్' తుపానుగా నామకరణం చేశారు. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణం మారిపోయిందని చెప్పారు. ఉత్తర- వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ నేడు తుపానుగా మారుతుందని వివరించారు. 

Also Read: అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌గా భారతీయుడు..అసలేవరి భట్టాచార్య!

మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారి తమిళనాడు-శ్రీలంక తీరాలవైపు వెళ్లే అవకాశాలున్నాయని చెప్పారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు.ఫెంగల్ తుపాను ప్రభావంతో దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఒక్రటెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

AlsoRead:నెల్లూరు టీడీపీలో ఫైట్.. మంత్రి నారాయణ Vs ఎమ్మెల్యే కోటంరెడ్డి!

నాలుగైదు రోజులపాటు విపరీతంగా చల్లగాలులు వీచే అవకాశాలు భారీగా ఉన్నాయని అన్నారు. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నేడు, ఈనెల 28, 29న మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయని అధికారులు తెలిపారు.

Also Read: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు

తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఈ మేరకు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు చేశారు.ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల 8 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లోని చలి తీవ్రత పెరిగింది. 

AlsoRead:గుండెపోటు నిరోధించే ఔషధ ఫార్ములా..పేటెంట్‌ పొందిన బాపట్ల కాలేజీ బృందం

ఆదిలాబాద్, అసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లలాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం దట్టమైన పొగమంచు ఉంటుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe