Hyderabad: ఎలా ఉన్నారు.. ?బాగున్నావా..ఎలా చదువుతున్నావు.. పరీక్షలు ఎప్పుడు..అంటూ మాట్లాడింది.. తర్వాత న్యూడ్ వీడియో కాల్ చేసింది.. ఇంకేముంది.. తర్వాత ఏం జరిగి ఉంటదో అర్థం చేసుకోవచ్చు మీరే..!
Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్!
న్యూడ్ వీడియోతో బెదిరింపులు
ఆదిలాబాద్ సంజయ్నగర్కు చెందిన విద్యార్ధి(22) ఘట్కేసర్లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఇతను చౌదరిగూడ మల్లమ్మకాలనీలో అద్దెకు ఉంటున్నాడు. అయితే గురువారం రాత్రి అతని వాట్సాప్ కి దీక్షికా అగర్వాల్ అనే పేరుతో ఒక కాల్ వచ్చింది. కాల్ లో ఆ కిలాడీ లేడీ ఎలా ఉన్నారు.. ?బాగున్నావా..ఎలా చదువుతున్నావు.. పరీక్షలు ఎప్పుడు.. అంటూ మాట్లాడింది. అతను కూడా ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా బట్టలు లేకుండా న్యూడ్ గా మారింది. వెంటనే వీడియోను రికార్డ్ చేసింది. కొద్ది నిమిషాల తర్వాత రికార్డ్ చేసిన న్యూడ్ వీడియోను పంపి ఆ విద్యార్ధి నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించింది. దీంతో ఎక్కడ పరువు పోతుందేమోనని బెదిరిపోయిన విద్యార్ధి.. ఆన్ లైన్లో మూడు సార్లు 20 వేలు పంపించాడు. అయినా సరే ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేసింది కిలాడీ లేడీ. దీంతో ఆ విద్యార్ధి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే .. ఈ మధ్య కాలంలో హానీ ట్రాపింగ్ వలలో చిక్కుకొని ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. కొంతమంది కిలాడీ లేడీలు యువకులు, పొలిటీషియన్స్, ప్రముఖులు టార్గెట్ చేస్తూ ఈ మోసాలకు పాల్పడుతున్నారు. పరువు పేరుతో బాధితుల నుంచి లక్షలు కాజేస్తున్నారు.
Also Read: వామ్మో..! విష్ణు క్యారెక్టర్ గురించి రోహిణి అలా అనేసిందేంటి.. నిఖిల్, పృథ్వీ కోసం రచ్చ రచ్చ!
Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..!