హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన ఘటన జరిగింది. ఆర్టీవో అధికారులమంటూ కొందరు వసూళ్లకు పాల్పడ్డారు. ఇందులో భాగంగానే తాము అధికారులమంటూ రోడ్లపై వెళ్తున్న బండ్లను ఆపి అక్రమంగా డబ్బులు వసూళు చేస్తున్నారు. ఈ దందా అంతా దాదాపు ఏడాది కాలంగా జరుగుతుందని సమాచారం.
Also Read: అదానీతో ఒప్పందాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల కొందరు బాధితులు అయిన కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు, మేస్త్రీలు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమ బండ్లను ఆపి అక్రమంగా డబ్బులు గుంజేస్తున్నారని వాపోయారు. రోజుకు వేల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఈ మేరకు కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు, మేస్త్రీలు నవంబర్ 21న నకిలీ ఆర్టీవో అధికారిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నకిలీ ఆర్టీవో ప్రేమ్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రేమ్ కుమార్ ఆటో డ్రైవర్‌గా గుర్తించారు.
Also Read: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్.. అదానీ వ్యవహారంపై విచారణ?
అదిరిపోయే ట్విస్ట్
అయితే ఇప్పుడీ దందాలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకొచ్చాయి. ఈ వ్యవహారంలో సూత్రధారి అయిన ఆటో డ్రైవర్ ప్రేమ్ కుమార్‌ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా పాత్రధారి సంతోష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. సంతోష్ అడ్డా కూలీ కావడం గమనార్హం. వీరిద్దరూ ఇసుక, ఇటుక, సెంట్రింగ్ కాంక్రీట్ మిల్లర్ల వాహనదారులను లక్ష్యంగా చేసుకుని దందా చేస్తున్నట్లు తెలిసింది.
వీరిద్దరూ రోజు ఉదయం కారులో ఉప్పల్, నాగోల్, ఘట్ కేసర్, బోడుప్పల్ వెళ్తారు. అక్కడ కారులో సంతోష్ కూర్చుని చేతిలో ఒక ల్యాప్‌టాప్, రశీదు పుస్తకాలను పెట్టుకుంటాడు. అదే సమయంలో ప్రేమ్ కుమార్ రెడ్డి అటువైపుగా వచ్చిపోయే వాహనాలను ఆపి పేపర్లు అడుగుతాడు. అవి లేకుంటే సార్ దగ్గరకు పదా ఫైన్ వేస్తాడంటూ బెదిరిస్తాడు. అలా వాహనదారుల నుంచి డబ్బులు వసూళు చేశారు. ఇందులో సంతోష్‌కు రూ.500 కూలి ఇచ్చి మిగతాది ప్రేమ్ కుమార్ రెడ్డి తీసుకునేవాడని సమాచారం.