Gold Robbery: తెలంగాణలో భారీ చోరీ.. 15 కిలోల బంగారం మాయం

వరంగల్ జిల్లా రాయపర్తిలో ఉన్న ఎస్‌బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. రూ.10 కోట్ల విలువైన15 కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. గ్యాస్ కట్టర్ సాయంతో అలారం సిస్టమ్‌, సీసీ టీవీ ఫుటేజీని ధ్వసం చేశారు.

Gold Rates
New Update

TG News: వరంగల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయ్యారు. ఎస్‌బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. ఎకంగా లాకర్‌లో రూ.10 కోట్ల విలువైన బంగారం నగలను అపహరించారు గుర్తు తెలియని వ్యక్తులు. గ్యాస్ కట్టర్ సాయంతో బ్యాంకు కిటికీలను కట్ చేసి లోపలికి చొరబడి లాకర్‌లోని బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు కేటుగళ్లు. దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాయపర్తి ఎస్‌బీఐ బ్యాంకులో ఈ భారీ జరిగింది. లాకర్లలో ఉన్న సుమారు 15 కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లినట్లు గుర్తింపు.

10 కోట్ల విలువైన బంగారం చోరీ:

పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి బ్యాంక్​ వెనకాల ఉన్న కిటికీని తొలగించారు. బ్యాక్‌లోకి చొరబడిన తర్వత  ముందు అలారం సిస్టమ్​ను ధ్వసం​ చేసి సీసీ టీవీ ఫుటేజీని తీసేశారు. తర్వాత లాకర్స్​ రూంలోకి వెళ్లి బంగారం ఉన్న లాకర్‌కు​ కట్​ చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. నిన్న బ్యాంకు సిబ్బంది యధావిధిగా విధులకు వెళ్లారు.బ్యాంక్‌ షెట్టర్ ఓపెన్ చేసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. వస్తువులు, ఫైల్స్ చిందర వందరగా పడి ఉన్నది చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఎంత బంగారం పోయిందనే వివరాలను పోలీసులు వెల్లడించేందుకు నిరాకరించటంతో.. సుమారు 15 కిలోల బంగారం చోరీకి గురైట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇది కూడా చదవండి: జవాన్‌కి పునర్జన్మ.. 90 నిమిషాల తర్వాత మళ్ళీ కొట్టుకున్న గుండె

చోరీ విషయం తెలుసుకున్న బంగారం దాచుకున్న ఖాతాదారులు బ్యాంక్​ వద్దకు వచ్చారు. ఎంతో కష్ట పడి కొన్న నగలు దొంగలుపాటు అవ్వటంతో బ్యాంకు దగ్గర ఆందోళన చేశారు. మా నగలు మాకు ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బ్యాంక్‌ ఊరి శివారులో ఉండటంతోపాటు సరైనా సెక్యూరిటీ లేకపోవడంతో చోరీ  జరిగిందని అంటున్నారు. అంతేకాకుంగా  గతంలో కూడా ఈ బ్యాంక్‌లో దొంగలు పడ్డారు.  అప్పుడే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తే ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండేవని అంటున్నారు. ఘటనపై ఎస్​బీఐ ఆర్ఎం అబ్దుల్​ రహీంను వివరణ కోరేందుకు ఖాతాదారులు ప్రయత్నించారు. 

ఇది కూడా చదవండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

అయితే ఏ విషయాలు ఇప్పుడు చెప్పబోమన్నారు. ఖాతాదారులు ఆందోళనకు గురి కావద్దని తెలిపారు. అంతేకాకుండా ఎవరికి నష్టం కలగకుండా బంగారానికి సమానమైన డబ్బులు చెల్లిస్తామని తెలిపారు.  ఈ విచారణలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, స్థానిక ఎస్​ఐ శ్రవణ్​​కుమార్,​ తదితరులు పాల్గొన్నారు. దొంగల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని, త్వరలోనే నిందులను  పట్టుకుంటామని పోలీసలు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి:  ఫుడ్‌ ప్యాకింగ్‌కు అల్యూమినియం ఎలా ఉపయోగించాలి?

 

ఇది కూడా చదవండి: అలా చేయొద్దు నాన్న.. అన్నందుకే కూతురిని కడ తేర్చిన తండ్రి!

#gold #warangal #gold-robbery #tg-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe