భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతంలోని ఉత్తరాది ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతుండడం, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని వరదల పరిస్థితిపై మారథాన్ సమీక్ష సమావేశం నిర్వహించి మంత్రులు, కలెక్టర్లు, ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన సీఎం కేసీఆర్
New Update

మహారాష్ట్ర, ఎగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భధ్రాచలం వద్ద గోదావరీ నది ఉదృతంగా ప్రవహిస్తున్నందున గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి నదికి భారీగా ఇన్ ఫ్లో వస్తున్న నేపథ్యంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టుతో పాటు ఇతర రిజర్వాయర్లలోకి నీటిని విడుదల చేయాలని వరదలపై చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల సీఎం కేసీఆర్ సి.ఎస్ శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీచేశారు. పోలీసు సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని, సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు సిఎం అదేశించింది.

చలంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు...

ఇక.. భద్రాధ్రి కొత్తగూడెం జిల్లాలోని చలంలో ముంపుకు గురయ్యే అవకాశాలున్న తోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా ఉండాలని అధికారులను కోరారు. గతంలో వరదల సందర్భంగా... సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. ప్రస్థుతం హైద్రాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న దురిశెట్టి అనుదీప్ తక్షణమే బయలుదేరి భధ్రాచలం వెల్లి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా వుండాలని సిఎం అదేశించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు...

రాష్ట్ర సచివాలయంతో పాటు, కలెక్టరేట్ లో ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ప్రభుత్వం ఏర్పాటు సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రక్షణ దళాలను అందుబాటులో వుంచాలని సిఎం కోరారు. సీఎం ఆదేశాల మేరకు కంట్రోల్ రూం సహా హెలీకాప్టర్లు సంబంధిత సహాయకచర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికార యంత్రాంగం, భధ్రాచలంలో సహాయక చర్యలకు సిద్దం చేసింది. రెవిన్యూ, పంచాయితీ రాజ్, వైద్యారోగ్యశాఖ, డిసాస్టర్ మేనేజ్మెంట్, సహా సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. అందరూ అప్రమత్తంగా ఉంటూ.. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సీఎం అన్నారు. ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe