తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు.
పూర్తిగా చదవండి..- వాహనదారులు అతివేగంతో వెళ్లవద్దని సూచించారు. వేగంతో వెళ్తే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పరిమిత వేగంతో వాహనాలను నడపాలని సూచించారు.
- వాహనదారులు విధిగా హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించాలన్నారు.
- వాహనం సరైన కండిషన్లో ఉండేలా చూసుకోవాలన్నారు.
- అధిక వర్ష సమయంలో డ్రైనేజీలు పొంగుపొర్లుతున్నట్లు గమనిస్తే.. అటువైపు వెళ్లొద్దన్నారు.
వర్షాల వేళ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి.
👉 భారీ వర్షాల సమయంలో ఉప్పొంగుతున్న డ్రైనేజీలు, చెరువులు, కాలువలు, జలపాతాల వద్దకు వెళ్లకండి.
👉 మీ వాహనాల కండిషన్ ను, వాటి టైర్ల గ్రిప్ ను చెక్ చేసుకోండి.
👉 అత్యవసరర సమయాల్లో #Dial100 కు కాల్ చేయాలి. #MonsoonSafetyTips pic.twitter.com/sevlzlQUgi— Telangana Police (@TelanganaCOPs) July 20, 2024
- వర్షం కురిసేటప్పుడు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లొద్దన్నారు.
- వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద కూర్చోవద్దన్నారు. వర్షాలకు చెట్లు కూలే ప్రమాదం ఉందన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్ కు డయల్ చేయాలని సూచించారు - నిరంతరం ప్రజలకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఉంటారని.. వారి సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు.