Hyderabad: టైమ్స్‌ స్వ్కేర్‌ లాగే.. హైదరాబాద్‌లో త్వరలో టీ స్క్వేర్‌

అమెరికాలో ఉన్న టైమ్స్‌ స్క్వేర్‌లాగే హైదరాబాద్‌లో టీ స్క్వేర్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పరిశ్రమలు మౌళిక సదుపాయాల సంస్థ (TGIIC) ఆధ్వర్యంలో టీ స్క్వేర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.

New Update
Hyderabad: టైమ్స్‌ స్వ్కేర్‌ లాగే.. హైదరాబాద్‌లో త్వరలో టీ స్క్వేర్‌

అమెరికాలో టైమ్స్‌ స్క్వేర్‌ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతంలో ప్రతిరోజూ వివిధ కార్యక్రమాలు జరుగుతుంటాయి. జనాలతో అక్కడ నిరంతరం సందడి వాతావరణం ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి కల్చర్‌ హైదరాబాద్‌లోకి రానుంది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో ఓ భారీ ప్లాజాను నిర్మించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిశ్రమలు మౌళిక సదుపాయాల సంస్థ (TGIIC) ఆధ్వర్యంలో టీ స్క్వేర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.

Also Read: ఎల్‌బీనగర్ – హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు..!

ఈ మేరకు టీజీఐఐసీ టెండర్లకు ఆహ్వానించింది. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండటంతో సహా.. స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా టీ స్క్వేర్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అక్కడ జరిగే ఈవెంట్లతో రోజూవారి పనులతో బిజీ బీజీగా ఉండేవారికి ఆహ్లాద వాతావరణాన్ని కల్పించాలని భావిస్తున్నారు.

Also read: కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం!.. రేవంత్ బిగ్ ప్లాన్

Advertisment
తాజా కథనాలు