ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్‌ పెంచుకోవడానికి 10 ముఖ్యమైన చిట్కాలు తెలుసుకుందాం.

ఇన్‌స్టా రీల్స్/వీడియోలలో ట్రెండ్ అవుతున్న సాంగ్స్, ఆడియోలను ఉపయోగించాలి.

వీడియోలు క్లియర్‌గా, లైటింగ్‌తో ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోండి.

రీల్స్‌ను చిన్న నిడివిలో యూజర్ స్క్రోల్ చేసేలోపు వారి దృష్టిని ఆకర్షించేలా ఉండాలి.

కంటెంట్‌కు సరిపోయే ట్రెండింగ్, రిలేటెడ్ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించండి.

ప్రేక్షకులు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉండే సమయాన్ని గుర్తించి, ఆ సమయంలో పోస్ట్ చేయండి.

కంటిన్యూగా పోస్ట్‌లు చేస్తే ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ మీ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.

వీడియో చూసే వారిని లైక్, కామెంట్, షేర్ చేయమని కోరండి. కామెంట్స్‌కు రిప్లై ఇవ్వండి.

రీల్స్ లేదా పోస్ట్‌లకు ఆసక్తి కలిగించే కవర్ ఫోటో, టైటిల్ లేదా క్యాప్షన్ ఇవ్వాలి.

పోస్ట్ చేసిన ప్రతి రీల్‌ లేదా పోస్ట్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తే మీ ఫాలోవర్లకు వెంటనే చేరుతుంది.