SIM Cards: సైబర్ క్రైమ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్కామర్లు, దుండగులు సిమ్ స్వాపింగ్ ద్వారా సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. స్కామర్లు SIM స్వాపింగ్ ద్వారా వ్యక్తిగత వివరాలను సేకరించి.. వాటి సహాయంతో వారి మొబైల్‌లో మీ నంబర్‌ను యాక్టివేట్ చేస్తారు. ఆపై మీ నంబర్‌కు అందిన మొత్తం సమాచారాన్ని ఉపయోగించి.. కేటుగాళ్లు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తారు. స్కామర్‌లు సోషల్ మీడియా నుండి మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఆపై దానిని టెలికాం ఆపరేటర్‌కు అందజేస్తారు. వారి ఫోన్‌లో మీ SIM Cards కి యాక్సెస్‌ను పొందుతారు. ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా, స్కామర్ల చేతిలో బాధితులుగా మారకుండా ఉండాలంటే.. ముందుగా మన పేరిట ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. మరి అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..
Also Read: సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం
జస్ట్ 4 క్లిక్స్‌తో మీ పేరిట ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోండి..
మీ పేరులో ఎన్ని SIM కార్డ్ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుగా https://sancharsaathi.gov.in/Home/index.jsp అనే ప్రభుత్వ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఈ వెబ్‌సైట్‌కి మాత్రమే వెళ్లి.. అక్కడ మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఇది కాకుండా వేరే వెబ్‌సైట్‌కి వెళ్లినట్లయితే.. మోసపోయే అవకాశం ఉంది. ఇదికాకుండా.. నేరుగా Googleలో TafCop ని కూడా సెర్చ్ చెయ్యొచ్చు. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తరువాత.. సిటిజన్ సెంట్రిక్ ఆప్షన్‌లోకి వెళ్లి.. 'మీ మొబైల్ కనెక్షన్‌ని తెలుసుకోండి' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మొబైల్ నంబర్ (Mobile Number), క్యాప్చా కోడ్‌ను నమోదుచేసి ఎంటర్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ నంబర్‌పై OTP వస్తుంది. దాన్ని నమోదు చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని నంబర్లు లింక్ అయ్యాయో మీరు తెలుసుకోవచ్చు. మీరు స్క్రీన్‌పై కనిపించే ఏ నంబర్‌ను ఉపయోగించకుంటే, మీరు దాన్ని కూడా బ్లాక్ చేయవచ్చు. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్‌లో (Aadhar Card) గతంలో, ప్రస్తుతం జారీ చేసిన అన్ని నంబర్‌ల జాబితా కూడా కనిపిస్తుంది.
మోసపోకుండా ఉండాలంటే ఇది పాటించండి..
☛ ఏదైనా వెబ్‌సైట్‌లో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసే ముందు.. వెబ్‌సైట్ సురక్షితమైనదేనా? లేదా? అనే విషయాన్ని చెక్ చేయండి. అలాగే వెబ్‌సైట్ అధికారికమైనదా కాదా అనే విషయాన్ని కూడా గమనించాలి.
☛ మీ వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో ఎప్పుడూ షేర్ చేయకండి.
☛ సాధ్యమైనంత తక్కువగా మీ బ్యాంక్ ఖాతా, Gmailకి లింక్ చేయబడిన మీ ప్రైమరీ మొబైల్ నంబర్‌ను ఇవ్వండి. ప్రస్తుత కాలంలో స్కామర్లు మొబైల్ నెంబర్ ద్వారానే అనేక రకాల సమాచారాన్ని పొందుతున్నారు.
☛ మీ డిజిటల్ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ పాస్‌వర్డ్‌లను స్ట్రాంగ్‌గా సెట్ చేసుకోండి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ షేర్ చేయకండి.
Also Read: యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్ కు ఆర్బీఐ షాక్!