ENG vs IND: ఉప్పల్‌లో తిప్పలు పడ్డ టీమిండియా.. ఫస్ట్ టెస్ట్‌లో తప్పని పరాభవం

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ పరాభవంతో ప్రారంభించింది. ఇంగ్లీష్‌ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. 7వికెట్లతో చెలరేగిన టాం హార్ట్లీ భారత జట్టు పతనాన్ని శాసించాడు.

ENG vs IND: ఉప్పల్‌లో తిప్పలు పడ్డ టీమిండియా.. ఫస్ట్ టెస్ట్‌లో తప్పని పరాభవం
New Update

ENG vs IND: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ పరాభవంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్ (Uppal Test Match) విజయంతో ఇంగ్లీష్‌ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. 7వికెట్లతో చెలరేగిన టాం హార్ట్లీ (Tom Hartley) భారత జట్టు వెన్నువిరిచాడు. 231 పరుగుల లక్ష్యంతో నాలుగోరోజు బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఇంగ్లీష్‌ స్పిన్నర్ల దాటికి భారత టాపార్డర్‌ కుప్పకూలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (15) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరగా, శుభ్‌మన్‌ గిల్‌ డకౌట్‌తో నిరాశపరిచాడు. కాసేపటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (39) (Rohith Sharma) ఎల్బీగా వెనుదిరిగాడు. వరుస బౌండరీలతో జోరుమీదున్నట్టు కనిపించిన అక్షర్‌ పటేల్‌ లాస్ట్‌ సెషన్‌ మొదటి ఓవర్‌లో ఔటయ్యాడు. కాసేపు క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన కేఎల్‌ రాహుల్‌ను జో రూట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అనంతరం జడేజా రనౌట్‌తో భారత్‌కు మరో పెద్ద షాక్‌ తగిలింది.

పోరాడిన మిడిలార్డర్‌
టాపార్డర్‌ విఫలమైనా టీమిండియా మిడిలార్డర్‌ ఇంగ్లాండ్‌ స్పిన్నర్లను కొంతసేపు నిలువరించి పరుగులు రాబట్టగలిగింది. ఎనిమిదో వికెట్‌కు 8వ వికెట్‌కు అశ్విన్‌-భరత్‌ 50 పరుగుల భాగస్వామ్యం పూర్తిచేయడంతో భారతజట్టు పరాజయం అంతరాన్ని తగ్గించుకోగలిగింది. 176 పరుగుల వద్ద భరత్‌, 182 పరుగుల వద్ద అశ్విన్‌ ఔటవడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖాయమైంది. ఇక 202 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ విజయ లాంఛనం పూర్తయ్యింది. ఇంగ్లాండ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో హార్ట్లీ 7, జో రూట్‌ 1, జాక్‌ లీచ్‌ 1 వికెట్లు పడగొట్టారు.

#ind-vs-eng-test-match
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe