బిగ్ బాస్-7 సీజన్‌పై ప్రత్యేక దృష్టి..
ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆ షోలో కంటెస్టెంట్స్ మధ్య జరిగే మాటల యుద్ధం, ప్రేమ, సెంటిమెంట్ ఎలా జరుగుతుందనే దానిపై తెగ చర్చింకుంటూ ఉంటారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. అంతేనా వారికి అభిమాన సంఘాలు అంటూ ప్రొఫైల్స్ పేజీలు కూడా రన్ చేస్తూ ఉంటారు. అంత హడావిడి ఉంటుంది మరి ఈ షోకి. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ షో 2017లో తెలుగులో కూడా ప్రసారం కావడం మొదలైంది. జూ.ఎన్టీఆర్, నాని తొలి రెండు సీజన్‌లకు హోస్ట్‌లుగా వ్యవహరించారు. తర్వాతి సీజన్ నుంచి నాగార్జున వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. అయితే గత సీజన్ అంతగా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఊరు పేరు తెలియని కంటెస్ట్‌లను తీసుకోవడంతో పెద్దగా ఎవరకి నచ్చలేదు. దీంతో 7వ సీజన్‌పై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జనాలకు తెలిసిన వారినే హౌస్‌లోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.
కంటెస్టెంట్‌గా క్రికెటర్ వేణుగోపాల్?
ఇప్పటికే చాలా మందిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అయితే కంటెస్ట్‌ల పేర్లను మాత్రం రిలీవ్ చేయలేదు. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎవరెవరు పాల్గొనబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని కంటెస్టెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు మేకర్స్. ఇదిలా ఉండగానే తాజాగా భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్‌రావుని కంటెస్టుగా హౌస్‌లోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా టీంలో చోటు దక్కించుకున్న కొద్దిమంది తెలుగు ఆటగాళ్లలో వేణుగోపాల్ ఒక్కరు. భారత్ తరపున తక్కువ మ్యాచులే ఆడినా ఐపీఎల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం క్రికెట్‌గా గుడ్ బై చెప్పిన వేణు.. తెలుగులో ప్రసారమయ్యే క్రికెట్ మ్యాచులకు కామెంటరీ చేస్తున్నారు.
తొలి క్రికెటర్‌గా నిలుస్తారా?
వేణును తీసుకుంటే మంచి బజ్ వస్తుందని భావిస్తున్నారట. ఇటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా తమకు కలిసివస్తారని ప్లాన్ చేస్తున్నారట. అయితే క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన బిగ్ బాస్ లాంటి షోలో పాల్గొంటాడా? లేదా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ వేణు పాల్గొంటే మాత్రం బిగ్ బాస్‌లో పాల్గొన్న తొలి క్రికెటర్‌గా తెలుగు షో నిలవనుంది. ఇప్పటికే బుల్లితెర వివాదస్పద నటుడు ప్రభాకర్, విడాకులు తీసుకున్న ఓ జంట కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా 2005లో అరంగేట్రం చేసిన వేణుగోపాల్ ఇండియా తరపున 16 వన్డేలు ఆడి 218 రన్స్ చేశారు. చివరగా 2006లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో ఆడారు. ఐపీఎల్‌లో దక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల తరపున పాల్గొన్నారు.