Garlic Rice: సహజంగా వెల్లుల్లిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. వీటిలో పొటాషియం, ఫాస్పరస్ జింక్, సల్ఫర్, సెలీనియం, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము, ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో వీటిని తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. అలాగే ఇవి రోగ నిరోధకశక్తిని పెంచి.. వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి.
కావాల్సిన పదార్థాలు
I కప్పు- బియ్యం, 15-20 వెల్లుల్లి పాయలు, 2- లవంగాలు, 3- పచ్చి మిర్చి, 2- ఎండు మిర్చి, 2 టేబుల్ స్పూన్ - నెయ్యి/నూనె, 1/4gr- ఆవాలు, కొత్తిమీర, సాల్ట్ - రుచికి సరిపడ, శనగలు
Also Read: Blood Circulation: రక్త ప్రసరణ మెరుగ్గా జరగాలంటే.. ఈ ఆహారాలు తీసుకోవాల్సిందే
తయారీ విధానం
- ముందుగా బియ్యం శుభ్రంగా కడిగేసి.. అన్నం వండి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో కొంచం ఆయిల్ లేదా నెయ్యి వేసి వెల్లుల్లి పాయలను వేయించి పెట్టుకోవాలి.
- ఇప్పుడు వెల్లుల్లి పాయలు వేయించిన నూనెలో , ఎండు మిర్చి, కరివేపాకు, శనగలు లేదా పల్లీలు వేసి కాసేపు వేగిన తర్వాత.. ఇప్పడు ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి.. ఉల్లిపాయలు దోరగా అయ్యేవరకు వేయించండి.
- ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను దీంట్లో వేసి రుచికి సరిపడ ఉప్పు వేసి కాసేపు తర్వాత.. తీసి పక్కన పెట్టండి.
- ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసి.. దాంట్లో కాస్త నిమ్మరసం, కొత్తిమీర వేసి మిక్స్ చేస్తే సరిపోతుంది. సింపుల్ అండ్ ఈజీగా టేస్టీ, హెల్తీ వెల్లుల్లి రైస్ రెడీ. దీన్ని పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు . వెల్లుల్లి ఇమ్యూనిటీ పెంచడానికి సహాయపడతాయి.
Also Read: Sankranthi 2024: సంక్రాంతికి రంగరంగుల ముగ్గులు, మధ్యలో గొబ్బెలు.. కారణమేంటో తెలుసా?