Vijayawada Murder: కొడుకు వేధింపులు భరించలేక కన్నతల్లి కసాయి తల్లిగా మారింది. కొడుకును దారుణంగా హతమార్చింది. ఈ అమానుషమైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకు..మద్యం సేవించి నిత్యం ఇంట్లో గొడవ పడుతుండేవాడు. ప్రవర్తన మార్చుకొమ్మని తల్లి పలుమార్లు హెచ్చరించిన ఏ మాత్రం మార్పు కనిపించలేదు. కుమారుడి ప్రవర్తనకు తల్లి విసుగు చెందింది. కొడుకు వేధింపులు భరించలేకపోయింది.
గత నెలాఖరున అర్ధరాత్రి తాగున్న కొడుకుని ఊపిరి ఆడకుండా హత్య చేసింది. కూతురు, మరో వ్యక్తితో కలిసి కొడుకుని కిరాతకంగా చంపింది కసాయితల్లి. హత్య చేసి ఏమీ ఎరుగనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాగి గొడవపడటంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయామని..ఉదయాన్నే చూసే సరికి చనిపోయి ఉన్నాడని పోలీసులకు తెలిపింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. కన్నతల్లే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కొడుకు ప్రవర్తనకు విసుగు చెందిన తల్లి ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలింది. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Also Read: ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక.. ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని!