Rajinikanth at Vijayakanth Funeral: డీఎండీ(DMDK)కే అధినేత, సీనియర్ నటుడు విజయకాంత్ డిసెంబర్ 28న చెన్నై(Chennai)లో తుదిశ్వాస విడిచారు. ఆయనకు నివాళి ఆర్పించేందుకు ప్రముఖులు విజయకాంత్ పార్థివదేహం వద్దకు చేరుకోని బోరున విలపించారు. తన రాబోయే చిత్రం ‘వెట్టయన్’ షూటింగ్లో భాగంగా టుటికోరిన్లో ఉన్న రజనీకాంత్(Rajinikanth), కెప్టెన్‌కు చివరి నివాళులు అర్పించేందుకు చెన్నై చేరుకున్నారు. అక్కడ నుంచి రజనీకాంత్ బయటకు వెళుతున్నప్పుడు తన కారులో ఏడుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Thalaiva
Not able to see u cry
Tears in my eyes upon seeing this
Take care of ur health Thalaiva
We love u lots
😔😔#Vijayakanth pic.twitter.com/3zvnj4C2YL— Dr.Ravi (@imravee) December 29, 2023
తట్టుకోలేకపోతున్న తోటి నటులు:
ప్రముఖ నటుడు విజయకాంత్‌కు నివాళులు అర్పించేందుకు చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలోని ఐలాండ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం అభిమానులు పోటెత్తారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నివాళులు అర్పించారు. తోటి నటుడు విజయకాంత్ మరణవార్త తెలుసుకున్న రజనీకాంత్ టుటికోరిన్ నుంచి చెన్నై చేరుకున్నారు. విజయకాంత్ లాంటి వారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రజనీకాంత్ అన్నారు. విజయకాంత్ భౌతికకాయానికి పూలమాల వేసిన రజనీకాంత్ ఆ తర్వాత తన కారు వద్దకు చేరుకోని ఏడ్చేశారు. రజనీకాంత్ కన్నీటి పర్యంతమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షూటింగ్ ఆపేసి వచ్చిన రజనీ:
రజనీకాంత్ గురువారం (డిసెంబర్ 28, 2023) తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో తన రాబోయే చిత్రం వేట్టైయాన్ షూటింగ్లో ఉండగా, విజయకాంత్ విషాద మరణం గురించి తెలుసుకున్నారు. నివేదికల ప్రకారం ఆయన వెంటనే షూట్‌ను రద్దు చేసుకోని తన స్నేహితుడికి చివరి నివాళులు అర్పించారు. దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) చీఫ్‌కి డిసెంబర్ 29, 2023న పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయన అభిమానుల భారీ రద్దీ కారణంగా శ్మశానవాటికకు చేరుకోవడానికి 10.7 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. తుపాకీ వందనం తర్వాత గౌరవ సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) , రాష్ట్ర మంత్రులు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, కుమారులు విజయ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్ ఉన్నారు.
Also Read: న్యూ ఇయర్ రోజున మీ లవర్‌కి ఈ వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వొద్దు.. బ్రేకప్ అవ్వొచ్చు!
WATCH: