Viduthalai: కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ముందుకెళ్తున్నారు. ఇటీవలే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మహారాజ’ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు. తండ్రి, కూతుళ్ళ సెటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ సేతుపతి-కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కాంబోలో రూపొందుతున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘విడుతలై’ పార్ట్ 2. తమిళ్ లో సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘విడుతలై’ పార్ట్ 1 సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
‘విడుతలై’ పార్ట్ 2 రిలీజ్ సెట్
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న తమిళ్, తెలుగు, ఇతర భాషల్లోనూ విడుదల కానున్నట్లు ప్రకటించారు. తెలుగులో విడుదల అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే క్రిస్మస్ కానుకగా రామ్ చరణ్- శంకర్ గేమ్ చేంజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాల మధ్య క్లాష్ గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Mark your calendars! Maverick director #VetriMaaran’s #ViduthalaiPart2 is coming to theatres on December 20, 2024.#ViduthalaiPart2FromDec20
An @ilaiyaraaja Musical @sooriofficial @elredkumar @rsinfotainment @GrassRootFilmCo @ManjuWarrier4 @BhavaniSre @anuragkashyap72… pic.twitter.com/3GQUpSXOvw
— VijaySethupathi (@VijaySethuOffl) August 29, 2024
Also Read: Coolie: రజినీ కాంత్ ‘కూలీ’ లో కింగ్.. నాగార్జున లుక్ అదిరింది..! – Rtvlive.com