Nayanthara : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) మరో సంచలన వార్తతో వార్తల్లో నిలిచారు. ఎల్లప్పుడూ సినీ సెలబ్రిటిలు, రాజకీయ ప్రముఖుల జీవితాలకు సంబంధించిన దోషాలు, భవిష్యత్తు గురించి చెబుతూ భారీ పాపులారటీ సంపాదించుకున్న ఆయన.. ముఖ్యంగా సినీ తారలకు సంబంధించిన విడాకుల ఇష్యూలతో ఒక సెలబ్రిటిగా మారిపోయాడు. దీంతో చాలామంది వేణుస్వామి చెప్పిన జాతకాన్ని నమ్మడమే కాకుండా ఆయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటున్నారు.
త్వరలోనే విడాకులు..
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. నయనతార- విగ్నేష్ శివన్(Nayanthara – Vignesh Sivan) దంపతుల దాంపత్యం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మేరకు గతంలో నయనతారకు పెళ్లి సెట్ కాదని, ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా నయనతార తన భర్త నుంచి విడిపోయే ఛాన్స్ ఉందని, త్వరలోనే విడాకులు తీసుకునే అవకాశం ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ‘ప్రస్తుతం నయనతారకు గడ్డు పరిస్థితులు ఎదురకానున్నాయి. సినిమాల పరంగా కేసులతోపాటు దాంపత్య జీవితంలోనూ సమస్యలు తలెత్తనున్నాయి. అది విడాకుల(Divorce) వరకూ దారితీసే ఛాన్స్ ఉంది’అంటూ పలు నివేదికలు రాసుకొచ్చాయి.
ఇది కూడా చదవండి : Trivikram: ఇది గుంటూరు ఘోరం.. గురూజీ దొరికితే కుర్చీ మడతపెట్టడమే.. త్రివిక్రమ్ పై ట్రోలింగ్
వరుస వివాదాలు..
ఇక వేణుస్వామి వ్యాఖ్యలపై నయన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పచ్చని సంసారంలో ఎందుకు చిచ్చురేపుతున్నావంటూ వేణుస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వేణుస్వామిని నమ్మేవారు మాత్రం.. తాజా పరిణామాల బట్టి వేణు స్వామి చెప్పిన మాటలు నిజమవుతాయేమో అంటున్నారు. ఎందుకంటే ఆమె పెళ్లి అయిన కొన్ని రోజులకే తిరుమల(Tirumala) దేవస్థానం వివాదంలో ఇరుక్కుంది. ఆ తర్వాత పిల్లల కారణంగా కోర్టులో విచారణ ఎదుర్కొంది. ఇప్పుడు ‘అన్న పూరణి’(Annapoorani) సినిమాపై కేసులు అవుతున్నాయి. ఇదంతా చూస్తే ఆమె జీవితం ఇబ్బందుల్లో పడే అవకాశం బలంగా కనిపిస్తోందంటున్నారు.