Pawan Kalyan: అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ మద్రాసులో ఉండే సమయంలో తిరుమలకి వచ్చే భక్తులు, ఆ శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఆయన్ని చూసేందుకు మద్రాస్ కి వెళ్లేవారంట. దాంతో ఆయన ఉదయం 5 గంటలకు ఆయన ఇంటి బయటకు వచ్చేవారని..ఆయన్ని చూసిన అభిమానులు వెనక్కి వచ్చేవారని తెలుసు కదా. ఇప్పుడు తాజాగా అలాంటి సీనే మళ్లీ రిపీట్ అవుతుంది. అది ఎక్కడో కాదు…పిఠాపురంలో.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించింది పిఠాపురం నియోజకవర్గం నుంచే అనే సంగతి తెలిసిందే. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలి అని నిర్ణయించుకున్న తరువాత ఆయన అక్కడ ఓ ఇంటిని తీసుకుని ఉంటున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు పెద్ద టూరిజం ప్లేస్ గా మారిపోయింది.
ఎందుకంటే అన్నవరం వచ్చిన ఆయన అభిమానులు కచ్చితంగా పిఠాపురం వచ్చి ఆయన ఇంటిని దర్శించుకుని , సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీని గురించి అక్కడికి వచ్చిన వారిని ఈ విషయం గురించి మీడియా ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా..ఈ ఇల్లే మాకు దేవాలయం. పవనే మాకు దేవుడు అంటూ సమాధానమిచ్చారు.
ఇప్పటికే చాలా మంది య్యూటూబర్స్, ఇన్ స్టా స్టార్స్, సోషల్ మీడియా స్టార్స్ కూడా ఆ ఇంటి వద్ద రీల్స్ వంటివి చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం నాగబాబు కుమార్తె తాను ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాళ్లు సినిమా ప్రమోషన్స్ కి కూడా అక్కడికే వెళ్లి చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఇల్లు బాగా ఫేమస్ అయిపోయింది.
Also Read: తమ్ముడు మోక్షజ్ఞకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..! ట్వీట్ వైరల్