Transparent Toilet in Japan: టాయిలెట్‌కి చాలామంది సీక్రెట్ వెళ్తారు. నాలుగు గొడల మధ్య కాలకృత్యాలు తీర్చుకోని బయటకు వస్తారు. ఇంట్లో టాయిలెట్ అయినా, పబ్లిక్ టాయిలెట్ అయినా నాలుగు గొడల మధ్యే ఉంటుందన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే జపాన్‌లోని ఓ ప్లే పార్క్ నిర్వాహకులు మాత్రం కాస్త ఢిఫరెంట్‌గా థింక్ చేశారు. ఓ టాయిలెట్‌ను ఓపెన్‌గా కనిపించేలా డిజైన్ చేశారు. అది కూడా గ్లాస్ అద్దాలతో బాత్రూమ్ను కట్టారు. లోపలిది బయటకు, బయటది లోపలికి కనిపించేలా టాయిలెట్ ఉండడం నెటిజన్లను షాక్‌లో ముంచేసింది. ఇదేం వింతరా బాబు అని అందరూ ఆ వీడియోను తెగ చూసేస్తున్నారు!
These two public toilets in Tokyo have transparent walls.
Once you enter the toilet and lock the door, its glass wall becomes opaque.#gigadgets #publictoilet #publicart #japandesign #architecturedesign pic.twitter.com/OpMbfxR6qb— GiGadgets (@gigadgets_) October 16, 2022
నిజానికి పబ్లిక్ టాయిలెట్ అత్యంత ప్రైవేట్ ప్లేస్. లోపల జరిగేది ఏదీ కనిపించకుండా చాలా సీక్రెట్‌గా పకడ్బందీగా కడతారు. కాని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పబ్లిక్ టాయిలెట్ మాత్రం లోపల ఎవరున్నారు.. ఏం చేస్తున్నారో కూడా కనిపిస్తుంది. మీరు చూస్తున్న వీడియోలో టాయిలెట్‌ను క్లియర్‌గా చూడవచ్చు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. టాయిలెట్ లోపల ప్రత్యేకంగా ఓ టెక్నాలజీ ఉంది. డోర్ క్లోజ్ చేయగానే గ్లాస్ ట్రాన్స్పరెన్సీ పోతుంది. అదిబ్లైండ్గా మారిపోతుంది. క్రమంగా మీరు లోపల సీన్‌ని చూడలేరు. తలుపు తెరిచిన వెంటనే మళ్లీ లోపల ఏం జరుగుతుందో కనిపిస్తుంది. అంటే మీరు టాయిలేట్‌ను పర్శనల్‌గా యూజ్ చేసుకునేటప్పుడు డోర్ క్లోజ్ ఆప్షన్ నొక్కితే సరిపోతుందన్నమాట!
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ టాయిలెట్ జపాన్- షిబుయాలోని ఓ ప్లే పార్క్‌లో నిర్మించారు. ఈ పబ్లిక్ టాయిలెట్ గ్లాస్‌తో నిర్మించడం వెనుక ఒక ముఖ్యం ఉద్దేశం ఉంది. ఇలా బయటకు కనిపించడం వల్ల టాయిలేట్‌ను మరింత సురక్షితంగా చూసే బాధ్యత నిర్వాహకులపై పెరుగుతుందట!