Times Now Survey on AP Elections: ఏపీలో రానున్న 2024 ఎన్నికల్లో ప్రజలు అధికారం ఎవరికి కట్టబెట్టనున్నారు. సీఎం జగన్ కు ఏపీ ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారా? లేదా మళ్లీ చంద్రబాబు అనుభవానికీ ఓటేయ్యాలన్ని డిసైడ్ అవుతారా? వైసీపీని ఇంటికి పంపిస్తామంటున్న జనసేన ప్రభావం ఏ మేరకు ఉంది? తాజాగా ప్రముఖ జాతీయ ఛానెల్ టౌమ్స్ సంచలన సర్వేను రిలీజ్ చేసింది.
ఏపీలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఇప్పటికైతే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంపై క్లారిటీ మాత్రం లేదు. కానీ జగన్ (CM YS Jagan) ముందస్తుకు వెళ్లే ఆలోచనే లేదన్నారు. సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీలో ఎన్నికలకు వెళ్తామంటూ జగన్ ప్రకటించారు. కానీ అన్ని పార్టీలు ఇప్పుడు..ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి. ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతూ..మాస్టర్ ప్లాన్స్ రూపొందించుకుంటున్నాయి. ఇదే సమయంలో వరుసగా జాతీయ ఛానెల్స్ నిర్వహిస్తున్న సర్వేలు హాల్ చల్ చేస్తున్నాయి. జాతీయ ప్రముఖ ఛానెల్ టైమ్స్ నౌ (Times Now) ప్రతినెలా ప్రజల నాడీ ఎలా ఉందో తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే.
టౌమ్స్ నౌతోపాటు ఆ మధ్య ఇండియా టీవీ (India TV)కూడా ఏపీలో ఎంపీ సీట్లు ఏపార్టీ ఎన్ని వస్తాయన్న దానిపై సర్వే నిర్వహించింది. అసెంబ్లీలో ఏపార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుందన్న దానిపై క్లారిటీ ఇఛ్చింది. ఆ తర్వాత ఇండియాటుడే సీ ఓటర్ కలిసి మూడ్ ఆఫ్ ది నేషన్ (Mood of the Nation)పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఏపీలోని ఎలాంటి పరిస్థితి ఉంది…ఇఫ్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశంపై పూర్తిగా వివరణ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం.. సంచలన సర్వే.. సీట్ల లెక్కలివే..!!
అయితే లేటెస్టుగా టౌమ్స్ నౌ విడుదల చేసిన సంచలన సర్వే ఫలితాలు మాత్రం..ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..ప్రజలు మరోసారి వైసీపీ (YSRCP) ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు రెడీగా ఉన్నారని తేలింది. అంటే ఏపీలో మరోసారి జగన్ మోహన్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని వెల్లడించింది. ఈ మూడు సర్వేలు తేల్చి చెప్పింది ఒక్కటే…ఏపీలో భారీ మెజార్టీతో వైఎస్ జగన్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయమని. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి దాదాపు 4ఏళ్లు గడుస్తున్నప్పటికీ అధికార పార్టీకి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని ఈ సర్వేలు స్పష్టం చేశాయి.
తాజాగా సర్వేలో వైసీపీకి ఏపీలో 51.10శాతం ఓటు షేర్ దాదాపు 24 నుంచి 25 ఏంపీ సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తుందని తన సర్వేలో పేర్కొంది. అటు టీడీపీ(TDP)కి ఏపీలో 36.40శాతం ఓట్లతో కేవలం 1 సీటు పరిమితం అవుతుందని సర్వేలో వెల్లడించింది. ఇదే సీన్ ఇటు అసెంబ్లీలోనూ రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అసెంబ్లీ సీట్లలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో టీడీపీకి షాక్ తగలనుంది. అయితే చంద్రబాబు (Chandrababu) ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయిన తర్వాత ఆయనపై సానుభూతి కనిపించింది. కానీ అది ఓట్ల రూపంలో మాత్రం లేదని టైమ్స్ నౌసర్వేలో వెల్లడైంది. అటు పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన పార్టీ…ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమంటూ సభలు పెట్టి..ఊదరగొట్టిన పవన్ కల్యాణ్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని సర్వేలో వెల్లడించింది. అటు టీడీపీ, ఇటు జనసేన కలిపి ఓటు శాతం 46.50శాతంమాత్రమే ఉంది. వైసీపీకి 50శాతానికి పైగా ప్రజలు సపోర్టు ఇస్తున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: మోదీకి ఝలక్.. కులాల లెక్కలు తేల్చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. బీసీలు ఎంతంటే?
ఇక అటు దేశవ్యాప్తంగా బీజేపీ (BJP) గాలివీస్తున్న ఏపీలో మాత్రం దాని ప్రభావం అంతగా లేదని సర్వే వెల్లడించింది. ఏపీలో బీజేపీ ఇంకా బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. బీజేపీ ఆధ్వర్యంలోని ఏన్డీఏకు 1.30శాతం మాత్రమే ఓట్లు వస్తాయని పేర్కొంది. మొత్తానికి టౌమ్స్ నౌ సర్వే ప్రకారం రెండోసారి జగన్ అధికారంలోకి రావడం పక్కా అని అర్ధమైంది. అయితే ఎన్నికలకు మరో 6 నెలల సమయం ఉది కాబట్టి ఈ లోపు రాజకీయ సమీకరణాలు ఏమైనా మారుతే…మాత్రం ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం.