Vizianagaram: శ్రీకాకుళం – విజయనగరం రెండు ఉమ్మడి జిల్లాలో రైతుల – ప్రజల దాహాన్ని తీరుస్తుంది కల్పవల్లి నాగావళి నది. లక్షల ఎకరాల్లో సాగునీరు అందించాలన్న ధ్యేయంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని తోటపల్లి బ్యారేజ్ (సర్దార్ గౌతు లచ్చన్న జలాశయం) నిర్మించారు. అయితే, ఈ ప్రాజెక్టు గడచిన ఐదేళ్లలో అభివృద్ధి కుంటుపడింది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు కూడికలు తీసివేతలు ఇంతవరకు చెయ్యలేదు.
Also Read: ఏపీలో గంజాయి మత్తులో కిడ్నాప్ కలకలం.. మూడు గంటల పాటు బట్టలు ఊడదీసి..!
కుడి, ఎడమ కాలువలు, చిట్టచివర ప్రాంతాలకు సాగునీరు అందాలంటే కష్టతరంగా మారింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు వద్ద భద్రత లేకపోవడంతో ఎన్నో అసాంఘిక కార్యక్రమాలకు దారితీస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వమైనా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని స్థానిక గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.