RTC MD Sajjanar: ఏపీ ఆర్టీసీ బస్సుతో ఫ్రాంక్ వీడియో చేసిన యువకుడిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా? అంటూ ప్రాంక్ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు. లైక్లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి’ అని సూచించారు.
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!?
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు
లైక్ లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి.… pic.twitter.com/KWlItXTygf
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 7, 2024