TDP Central Ministers: కేంద్ర కేబినెట్లో చోటు దక్కిన వారికి బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ గడ్కరీ, మేఘ్వాల్, శర్బానంద సోనావాల్, జితేంద్రసింగ్, టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్నాయుడు (Rammohan Naidu), పెమ్మసాని చంద్రశేఖర్‌కు (Pemmasani Chandra Sekhar) కాల్స్ వచ్చాయి. అలాగే మిత్రపక్షాల నేతల్లో కుమారస్వామి(జేడీఎస్), ప్రతాప్‌రావ్ జాదవ్‌కు ఫోన్‌కాల్ వచ్చింది. వీరందరూ ఈరోజు రాత్రి 7:15 గంటలకు మోదీతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నారు.