surya: తమిళ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సినిమా షూటింగ్లో భాగంగా సూర్యకు బలమైన గాయాలు అయ్యాయట. సూర్య ప్రస్తుతం ‘కంగువ అనే’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చైన్నైలో జరుగుతుంది. ఈ సినిమాలోని ఫైటింగ్ సీన్ చిత్రికరిస్తుండగా..సూర్య భూజానికి, కంటికి బలమైన గాయం అయిందట.
వెంటనే అలర్ట్ అయిన చిత్ర బృందం హుటాహుటిన స్ధానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైనా వైద్యం కోసం ఆయన్ను ఈ రోజు సాయంత్రానికి చైన్నైకు తరలించే అవకాశం ఉందని సమాచారం. సూర్య ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. సూర్యకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఆయన భార్య జ్యోతిక, కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఆయనకు ఏం కాకూడదని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘కంగువ’ సినిమా సూర్య కెరీర్లోనే ప్రతిష్మాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్దం అవుతుంది. ‘కంగువ’ను దాదాపు 38 భాషల్లో విడుదల చేస్తున్నామని మూవీ మేకర్స్ ప్రకటించారు.ఇప్పుడు సూర్యకు గాయం కావడంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
సూర్య తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగు రాష్ట్రల్లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తక్కువ కాదు. తెలుగులో సూర్య సినిమాలు గజినీ, నువ్వు నేను ప్రేమ, 24, జైభీమ్, ఆరు, ఘటికుడు, యముడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. సూర్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తమిళనాడులోని చెన్నైలో జూలై 23, 1975 న తమిళ సినీ నటుడు శివకుమార్, లక్ష్మి దంపతులకి జన్మించాడు.
పద్మ శేషాద్రి బాలా భవన్ స్కూల్ చెన్నైలోని సెయింట్ బేడెస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. చెన్నైలోని లయోలా కాలేజీ నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ బి.కామ్ పొందాడు. సూర్యాకు ఒక సోదరుడు కార్తీ, ఒక సోదరి బృందా ఉన్నారు. సూర్య జ్యోతికను 11 సెప్టెంబర్ 2006 న వివాహం చేసుకున్నారు. వారికి దియా,దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read: చిరు విశ్వంభరలో రానా విలన్?