Stree 2 Movie : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించిన హర్రర్ మూవీ’స్త్రీ 2′ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ కేవలం 10 రోజుల్లోనే రూ.500 కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన మొదటి వారమే రూ.300 కోట్ల కలెక్షన్ సాధించింది.
రెండో వారంలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూనే వస్తోంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద పదో రోజు ఇండియా వైడ్ రూ.426 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్ వసూళ్లతో కలిపి రూ.500 కోట్ల మార్కును దాటేసింది. సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం పై డైరెక్టర్ అమర్ కౌశిక్ ఆనందం వ్యక్తం చేశారు.
Also Read : ఆ హీరోలతో ఛాన్స్ వచ్చినా నటించకపోవడానికి కారణం అదే : శ్రద్ధా కపూర్
‘ స్త్రీ 2 కోసం దాదాపు రెండున్నరేళ్లు కష్టపడ్డాం. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. షూటింగ్ మొదటి రోజు నుంచే స్త్రీ 2 కథతో పూర్తిగా నిమగ్నమై తెరకెక్కించాం” అని అన్నారు. కాగా 2018 లో వచ్చిన ‘స్త్రీ’ మూవీకి సీక్వెల్ గా ‘స్త్రీ 2’ ను తెరకెక్కించారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా లీడ్ రోల్స్ లో నటించారు.