MaheshBabu-Ramyakrishna :సంక్రాంతి బరిలోకి దిగి దుమ్ము రేపే వసూళ్లు రాబడుతోన్న గుంటూరు కారం (Guntur kaaram)సినిమాకి ట్రోల్స్ మాత్రం తగ్గడం లేదు. గురూజీపై మీమ్స్ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా (Trivikram) త్రివిక్రమ్ పై ఇలా ట్రోల్స్ చేయడం, సినిమా పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో నిర్మాత నాగ వంశీ , డిస్ట్రిబ్యూటర్ (Dil Raju) దిల్ రాజు రియాక్ట్ అయి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అయినా సరే.. ఏదో ఒక రకంగా గుంటూరు కారం విమర్శల నెదుర్కొంటోంది. ఇప్పుడు తాజాగా మరో ట్రోల్ ట్రెండ్ అవుతోంది.
అలనాటి హీరోయిన్స్ తో త్రివిక్రమ్ ప్రయోగాలు
అలనాటి హీరోయిన్స్ ను త్రివిక్రమ్ మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఓ అదిరిపోయే సెంటిమెంట్ రోల్ ఇవ్వడం ఆయనకు అలవాటు.మనం గమనిస్తే .. అత్తారింటికి దారేది మూవీ లో నదియా కావచ్చు, ఆల.. వైకుంఠపురంలో టబు కావచ్చు, ఇలా వెనక్కి వెళ్తే.. కేవలం ఆయన రైటింగ్ సినిమాలోనూ ఇలా నటీమణులను తెరపైకి తీసుకురావడం మనకు తెల్సిందే. ఈ క్రమంలోనే అలనాటి అందాల హీరోయిన్ (Ramyakrihsna) రమ్యకృష్ణ కు గుంటూరుకారం సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రకు తీసుకోవడం జరిగింది.
మహేష్ – రమ్యకృష్ణ ఐటెం సాంగ్ వైరల్
అమ్మ నీయ…
వీళ్లిద్దరికీ ఒక సాంగ్ ఉందా 😂 దేంట్లో ఈ పాట ? pic.twitter.com/PK6xMKFvQO
— Onion Slice🧢 (@pepper__spray) January 13, 2024
ఇప్పుడు అదే .. గురూజీ చేసిన పెద్ద తప్పులా భావించి ట్రోల్స్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. రమ్యకృష్ణ తెలుగు తెరపై తన అందంతోను , అభినయంతోను ఇన్నేళ్ళుగా ఓ వెలుగు వెలుగుతోన్న నటి.కేవబలం హీరోయిన్ గానే కాకుండా ఐటెం పాటల్లో కూడా తళుక్కున మెరిసి ఆయా చిత్రాల విజయం,లో కీలకభూమిక పోషించింది.యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR) నా అల్లుడు (Naa Alludu) సినిమాలో ఎన్టిఆర్ తో చీకులమ్మే చిన్నది కావాలా అంటూ మురిపించింది రమ్యకృష్ణ, అలాగే (Allari Naresh)అల్లరి నరేష్ యముడికి మొగుడు (Yamudiki Mogudu) సినిమాలో అత్తో అత్తమ్మ కూతురో అంటూ చిందేసింది. ఇక..అసలు విషయానికి వస్తే .. సూపర్ స్టార్ మహేష్ బాబు (Nani) నాని సినిమాలో ఓ హాట్ రొమాంటిక్ ఐటెం సాంగ్ లో మహేష్ తో చేసింది. (Sj Surya)సూర్య డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ లో రమ్యకృష్ణ తో చేసిన ఈ పాటను రిలీజయిన రెండో రోజే మూవీ నుంచి డిలీట్ చేయడం కూడా జరిగింది. ఎప్పటిదో డిలీట్ చేసేసిన పాటను తవ్వకాల్లోంచి తీసిన లంకె బిందెల్లా ఇప్పుడు వెలుగులోకి తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఆనాడు ఐటెం పాటలో నర్తించిన జోడీని గుంటూరుకారం మూవీలో తల్లీకొడుకులుగా ఎలా చూపిస్తావు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.నటీనటులు ఏ పాత్రల్లో అయినా చేయాల్సివస్తుంది. ఒకప్పుడు అన్నాచెల్లెళ్లుగా నటించిన వాళ్ళు సైతం హీరోహీరోయిన్స్ గా నటించిన దాఖలాలు ఉన్నాయి. ఇదేం పెద్ద తప్పు విషయం కాదు అంటూ గురూజీకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు మొత్తానికి .. గురూజీ ఎంత కస్టపడి సంక్రాంతికి మాస్ ప్యాకేజ్ రెడీ చేసినా సరే .. ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటోంది.
వసూళ్ల సునామీతో న్యూ పోస్టర్
విచిత్రం ఏంటంటే ..ఎన్ని విమర్శలు ఎదురయినా.. గుంటూరు కారం మూవీ వసూళ్లలో ఘాటు చూపిస్తోంది. డే 1(Day one) కే వసూళ్ళలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక.. రెండు రోజుల వసూళ్లయితే దుమ్మురేగిపోయాయి. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా (127cr)127 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి తన స్టామినా ఏంటో చాటుతోంది. ఈ రెండు రోజుల వసూళ్ల అప్డేట్ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.
యూఎస్ లో తగ్గేదేలే
యూఎస్ లో సైతం గుంటూరుకారం తన సత్తా చాటుతోంది. వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ(2M) 2 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఇలా ఉంటె….పండగ తరువాత నాలుగు రోజులు వీకెండ్ ఈ వసూళ్లు పెరిగే అవకాశషం ఖచ్చితంగా ఉంది. సో.. ఎన్ని ట్రోల్స్ కు గురవుతున్నా .. వసూళ్ళలో త్రివిక్రమ్ – మహేష్ మార్క్ చూపిస్తోంది.
ALSO READ:Sankranti : సంక్రాంతికి అలరించనున్న కళ్యాణ్ రామ్ సినిమా!