T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఘోర ఓటమిపాలైంది. దీంతో వరుసగా రెండో మ్యాచ్ లోనూ ఓటమి చవిచూడటంపై పాక్ మాజీలు మాలిక్, షాహిద్ అఫ్రిదిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జట్టు ఓటమికి భారత అద్భుతమైన బౌలింగ్‌తోపాటు పాక్ బ్యాటర్ల తప్పిదాలే కారణమని మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ అన్నారు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన వసీమ్ ఇమాద్ 23 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడని, ఇదే పాక్ జట్టు ఓటమికి ప్రధాన కారణమన్నాడు.
Jasprit Bumrah appreciation post! 👏 👏
𝙏𝙖𝙠𝙚. 𝘼. 𝘽𝙤𝙬 🫡 🫡
Scorecard ▶️ https://t.co/M81mEjoub7#T20WorldCup | #TeamIndia | #INDvPAK | @Jaspritbumrah93 pic.twitter.com/QW4pyMcLlE
— BCCI (@BCCI) June 9, 2024
బంతులన్నీ వృథా చేశాడు..
‘ఒకసారి వసీమ్ ఇమాద్ ఇన్నింగ్స్‌ను చూడండి. చివర్లో దూకుడుగా ఆడాల్సి ఉన్నా అలా చేయలేదు. బంతులన్నీ వృథా చేశాడు. లక్ష్య ఛేదన కష్టంగా మారిపోయింది. ఒకవేళ కొన్ని పరుగులు చేసి ఉంటే పాక్ గెలిచేందుకు అవకాశం ఉండేదన్నాడు మాలిక్. ఇక మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం ఉన్నట్లు అనిపించడం లేదన్నాడు. కెప్టెన్ బాబర్ అజామ్‌తో సమస్యలు ఉన్నాయేమో తెలియదు. జట్టులోని ప్రతి ఒక్కరికి సారథి మద్దతుగా నిలవాలి. అంతా అతడి చేతిలోనే ఉంటుంది. జట్టును నాశనం చేయాలన్నా.. నాణ్యమైన టీమ్‌గా మార్చాలన్నా అతడికే సాధ్యం. ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత దీనిపై వివరంగా మాట్లాడతా. ఇప్పుడే చెబితే.. నేను షహీన్‌కు సపోర్ట్‌గా మాట్లాడుతున్నానని అనుకుంటారు. అతడు నా అల్లుడు కాబట్టే బంధుప్రీతి చూపానని వ్యాఖ్యలు చేసేవారూ లేకపోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ సూపర్ -8కి అర్హత సాధిస్తుందని చెప్పగలరా? ఆ దేవుడికే తెలియాలంటూ అక్తర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు.