Telangana Movement : తెలంగాణ ఉద్యమం ఒక సుధీర్ఘ పోరాటం. ‘జై తెలంగాణ’ (Jai Telangana) అనే నినాదం.. ఉద్యమ కాలంలో తెలంగాణ అంతటా ప్రతి ఊరు, వాడలో మారుమోగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పట్టువదలకుండా సాగిన ఈ పోరాటం దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఉద్యమంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాల ఫలితమే చివరికి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఈ పోరాటంలో ఎన్నో కీలకమైన ఉద్యమాలు, మరెన్నో మైలు రాళ్లు ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడు పరిశీలిద్దాం.
1969 జనవరి 5: ఇక్కడే తెలంగాణ ఉద్యమానికి మరో బీజం పడింది. తెలంగాణలో ఆంధ్రవాళ్లకే ఎక్కువ ఉద్యోగాలు (Jobs) ఇస్తున్నారని తెలియడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. పాల్వంచలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆంధ్రావాళ్లకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.
Also Read: 10 వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు : వికాస్‌రాజ్
1969 జనవరి 9: తాను ముల్కీ అయినా కూడా జాబ్ ఇవ్వలేదని.. బీఏ స్టూడెంట్, నేషనల్ స్టూడెంట్స్ యునియన్ (National Students Union) లీడర్ రవీంద్రనాథ్.. గాంధీ చౌక్ దగ్గర దీక్ష చేశారు. ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు.. కవి శ్రీర కవి రాజమూర్తి సైతం ఈ దీక్షలో పాల్గొన్నారు. పలు డిమాండ్లతో తెలంగాణ రక్షణ సమితి ఏర్పాటు చేశారు. 1969 జనవరి 10: నిజామాబాద్, ఉస్మానియా యూనివర్సిటీకి ఈ నిరసనలు పాకాయి.
1969 జనవరి 13: ఉస్మానియ యూనివర్సిటిలో ‘తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి’ ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాలనే లక్ష్యంతో విద్యార్థులు తీర్మానం చేశారు. అదే రోజున కొంతమంది ప్రముఖులు కలిసి ‘తెలంగాణ పరిరక్షణ కమిటీ’ని ఏర్పాటు చేశారు.
1969 జనవరి 20: శంషాబాద్‌లో పాఠశాల విద్యార్థులపై కాల్పులు జరిగాయి.
1969 జనవరి 24: సదాశివపేటలో ఉద్యమంలో భాగంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మందికి గాయాలయ్యాయి. చికిత్స తీసుకుంటూ ఆ తెల్లారే శంకర్ (17) అనే విద్యార్థి చనిపోయారు. ఆయనే తొలి దశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో తొలి అమరుడు.
1969 ఫిబ్రవరి 28: యువకులు, మేధావులందరూ కలిసి హైదరాబాద్‌లో ‘తెలంగాణ ప్రజా సమితి’ని ఏర్పాటు చేశారు.
1969 మార్చి 29: నాన్ ముల్కీలను పంపించేయడం సరైంది కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. స్థానికేతరులను పంపించే ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో సుప్రీం కోర్టు తీర్పును ఖండిస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఏకంగా తన మంత్రి పదవికే రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేసి.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దారి చూపించారు.
1969 ఏప్రిల్ 12: ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆపడం కోసం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 8 పాయింట్ ఫార్ములాను ప్రతిపాదించారు.
1969 జూన్ 10: ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంత ఉద్యోగులంతా సమ్మెలు చేశారు. ఈ నెలంతా సమ్మేలు,బంద్‌లతో అప్పట్లో సంచలనం రేపింది.
1969 జూన్ 24: అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. అందరితో ఆమె చర్చలు జరిపినప్పటికీ కూడా అవి విఫలమయ్యాయి.
1969 జూన్ 25: హైదరాబాద్‌లో ఉద్యోగుల సమ్మె చేశారు.
1969 జూన్ 27: అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
1969 ఆగస్టు 18: పార్లమెంటులో తెలంగాణ ప్రాంత ఎంపీలు కాకా జి. వెంకటస్వామి, జి.ఎస్. మేల్కోటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర గళాన్ని వినిపించారు.
1969 సెప్టెంబర్ 25: టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రపతిని కలిశారు. తమకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరారు.
1969 నవంబర్ 26: ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్టు మర్రి చెన్నారెడ్డి ప్రకటన చేశారు.
1970 డిసెంబర్ 10: ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవని ఉమ్మడి ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది.
1973 సెప్టెంబర్ 21: తెలంగాణ, ఏపీ ప్రాంతాల నేతల మధ్య ఆరు పాయింట్ల ఫార్ములాపై ఒప్పందం జరిగింది.
1985 డిసెంబర్ 30: జోన్ల వారీగా ఉద్యోగులను కేటాయించేందుకు జీవో 610 విడుదల చేశారు.
Also Read: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. పోలీసులు, విద్యార్థి నేతలకు మధ్య తీవ్ర తోపులాట.!
1996 నవంబర్ 1: వరంగల్‌లో భూపతి కృష్ణమూర్తి, జయశంకర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణను నిరసిస్తూ సభ నిర్వహించారు.
1997 సెప్టెంబర్ 28: ప్రొ. జయశంకర్, ప్రొ. కేశవరావ్ జాదవ్ ఆధ్వర్యంలో విడివిడిగా పనిచేస్తున్న 28 సంఘాలు కలిసి తెలంగాణ ఐక్య వేదికగా ఏర్పడ్డాయి.
2001 ఏప్రిల్ 27న: కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటైంది.
2009 నవంబర్ 29: కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష
2009 డిసెంబర్ 3: హైదరాబాద్ ఎల్బీనగర్ సర్కిల్లో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో పాల్గొన్న శ్రీకాంత్ ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో ఉద్యమం మరింత ఊపందుకుంది.
2011 మార్చి 10: ట్యాంక్ బండ్ పై పది లక్షల మందితో మిలియన్ మార్చ్
2011 సెప్టెంబర్: సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు సకలజనుల సమ్మె నిర్వహించారు. ఈ 42 రోజులు తెలంగాణ రాష్ట్రం మెుత్తం స్థంభించిపోయింది.
2013 జూలై 30: యూపీఏలోని అన్ని పార్టీలతో చర్చించి తెలంగాణకు అనుకులంగా కాంగ్రెస్ నిర్ణయం
2013 అక్టోబర్ 3: 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది.
2014 ఫిబ్రవరి 13: లోక్ సభలో ఏపీ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టారు
2014 మార్చి 1: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు
2014 జూన్ 2: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు (Telangana Formation Day)