Cricket: శ్రీలంకతో మూడు టీ20లు ఆడనున్న భారత టీమ్ సెలక్షన్‌పై క్రికెల్ లవర్స్, మాజీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐపీఎల్ తో పాటు ఇటీవల జింబ్యాబేతో సిరీస్ లోనూ రాణించిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ లాంటి యువకులకు అవకాశం కల్పించని కొత్త కోచ్ గంభీర్, సెలెక్టర్ అగార్కర్ పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలెంట్ ఉన్నవాళ్లను కాదని కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడం సరైనది కాదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే చెన్నై మాజీ బ్యాటర్ ఎస్.బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Shocked and surprised not to see Ruturaj Gaikwad in the Indian Team for both T20I and ODIs.
My Thoughts 🎥🔗 https://t.co/EBKnryFSUM#INDvSL #CricItWithBadri pic.twitter.com/OilIH1J4CB
— S.Badrinath (@s_badrinath) July 20, 2024
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రుతురాజ్‌ను శ్రీలంకతో టీ20లు, వన్డేలకు తీసుకోకపోవడం తనను షాక్‌కు గురి చేసిందని చెప్పాడు. ‘ప్రతిభ ఉన్న ఆటగాళ్లు జట్టుకు ఎంపిక కానప్పుడు.. ఆటగాళ్లు బ్యాడ్ బాయ్ ఇమేజ్ కలిగి ఉండటం అవసరమనిపిస్తుంది. జట్టులో ఎల్లప్పుడూ స్థానం ఉండాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషిన్‌షిప్‌లో ఉండాలేమో. బాడీనిండా టాటూలు వేయించుకోవాలేమో. లేదా మంచి మీడియా మేనేజర్‌ను కలిగి ఉండాల్సిన అవసరం ఉందేమో’ అంటూ సెటైర్స్ వేశాడు. ఇక జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో రుతురాజ్ రెండు మ్యాచ్‌ల్లో 77, 49 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. జింబాబ్వేపై శతకంతో ఆకట్టుకున్నా సెలెక్ట్ కాలేదు.