Bus Accident: ఏపీలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సీపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం దగ్గర అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. 50 మందికి పైగా ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ఐరన్ బ్రిడ్జిని ఢీకొట్టి కాలువలోకి వెళ్లింది. విషయం గమనించిన స్థానికులు వెంటనే ప్రయాణికులను కాపాడారు. ప్రాణనష్టం ఏమీ లేకపోగా పలువురికి గాయాలయ్యాయి. వర్షం, అందులోనూ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ఆ బస్సు రాజమండ్రి డిపోకు చెందినదిగా పోలీసులు తెలిపారు.
RTC bus accident
Accident : దారుణం.. ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి
TSRTC : హైదరాబాద్(Hyderabad) లో విషాదం చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు(RTC Bus) కింద పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేనగర్‌కు చెందిన ఆంజనేయులు(63) జేసీబీ ఎలక్ట్రీషియన్(JCB Electrician) పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సోమవారం రోజున ఓ జేసీబీని రిపేర్ చేసేందుకు అతను మియాపూర్ వచ్చాడు. పని పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు అతను బొల్లారం రోడ్డులో న్యూ కాలనీ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు.
Also Read: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఎండకాలం దృష్ట్యా బస్సు సర్వీసులు కుదింపు
అదే సమయంలో.. ఆంజనేయులు ప్రమాదవశాత్తు రోడ్డుపై వెళ్తున్న మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(RTC Bus Accident) కింద పడ్డాడు. బస్సు వెనక చక్రాలు అతడి తల మీదుగా వెళ్లాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కొడుకు చరణ్ తేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
Also read: అనర్హత వేటు పిటిషన్..స్పీకర్, కార్యదర్శి,దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.!
Crime: ఆర్టీసీ బస్సు ఢీ.. ప్రభుత్వ ఉద్యోగి మృతి!
Accident: ఆర్టీసీ బస్సు ఢీ కొని ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం చెందిన ఘటన జనాలకు కలచివేసింది. విధులు ముగించుకుని బైక్ పై వెళ్తున్న వ్యక్తి బస్సును ఓవర్ టెక్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు అదే బస్సు టైర్ల కింద పడి మరణించాడు. సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా అతన్ని నకిరేకల్ పట్టణానికి చెందిన సింగరి నరేష్ (34) గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బస్సును ఓవర్ టెక్ చేయబోయి..
నకిరేకల్ పట్టణానికి చెందిన సింగరి నరేష్ కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. 65వ నెంబర్ జాతీయ రహదారి వెంట మండలంలోని ఇనుపాముల నుంచి నకిరేకల్ వెళ్లే సర్వీస్ రోడ్డుపై బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. సింగరి నరేష్ గత ఏడాదిగా కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం కార్యాలయంలో విధులు ముగించుకుని మోటార్ సైకిల్ పై నకిరేకల్ వెళుతూ ఇనుపాముల శివారులోని జంక్షన్ వద్ద సూర్యాపేట నుంచి నల్లగొండ వెళ్తున్న సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కుడి వైపున ఓవర్ టేక్ చేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Mrinal: మృణాల్ ప్రైవేట్ పార్ట్స్ పై వల్గర్ కామెంట్స్.. నటి ఏమన్నారంటే!
ఈ క్రమంలోనే బస్సును ఓవర్ టేక్ చేస్తున్న మోటార్ సైకిల్ ను గమనించని ఆర్టీసీ డ్రైవర్ బస్సును అనుకోకుండా కుడివైపుకు తిప్పాడు. దీంతో బస్సు బైక్ ను ఢీ కొట్టడంతో నరేష్ బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చనిపోయాడు. ప్రమాద సంఘటన సమాచారం అందుకున్న కేతేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై శివతేజ గౌడ్ తెలిపారు.