Suicide : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజి విద్యార్ధి ప్రీతి(Medical Student Preethi) హత్య కేసులో సీనియర్ విద్యార్ధి సైఫ్ మీద వచ్చిన ఆరోపణలు వాస్తవేమనని తేల్చింది ర్యాగింగ్(Ragging) నిరోధక కమిటీ. సైఫ్‌పై గతంలో విధించిన సస్పెన్షన్ కాలం ఈ ఏడాది మార్చి 3వ తేదీతో ముగుస్తుండగా దీనిని మరో 97 రోజులపాటు పొడిగించింది. గత ఏడాది కాకతీయ వైద్య కళాశాల(Kakatiya Medical College) లో సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో ప్రీతిఎంజీఎం ఆసుపత్రి(MGM Hospital) లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఫిబ్రవరి 26న నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందింది.
Also read:ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌కు ప్రభుత్వం మెమో
సైఫ్ అరెస్ట్…
ప్రీతి చనిపోవడానికి కారణం సైఫ్నేని అప్పట్లోనే అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్‌కు పంపించారు. ఏడాది పాటు క్లాసులకు హాజరు కాకుండా కేఎంసీ ర్యాగింగ్ నిరోధక కమిటీ సైఫ్‌పై వేటు వేసింది. దీని మీద సైఫ్ హైకోర్టును ఆశ్రయించగా… తాత్కాలికంగా సస్పెన్షన్ ఎత్తివేసింది. తర్వాత నవంబర్ 9న హైకోర్టు ఆదేశాల మేరకు ర్యాగింగ్ నిరోధక కమిటీ సమావేశం నిర్వహించింది. దీనికి నిందితుడు సైఫ్ కూడా హాజరై వివరణ ఇచ్చాడు. దీనిపై చర్చించిన కమిటీ సైఫ్‌పై వచ్చిన ర్యాగింగ్ ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో కమిటీ విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించవచ్చని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
Also read:నేను కాదు యాక్సిడెంట్ చేసినది-మాజీ మంత్రి కొడుకు సోహెల్
సైఫ్ మీద యాక్షన్ తీసుకుంటారా?
ప్రీతి ఆత్మహత్యకు కారణం సైఫేనని ఇప్పుడు క్లియర్‌గా తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా సైఫే నిందితుడు అని తెలిసినా విచారణ కోసం ఆగాల్సి వచ్చింది. ర్యాగింగ్ కమిటీ నిజానిజాలు తేల్చడానికి వన్ ఇయర్ పట్టింది. ఈలోపు సైఫ్ తాత్కాలికంగా సస్పెండ్ నుంచి బయటపడ్డాడు కూడా.కానీ ఇప్పుడు ర్యాగింగ్ కమిటీ కూడా సైఫ్ మీద ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో అతనికి గట్టి శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
దీనికి తోడు ప్రీతి తల్లిదండ్రులు తమ కూతురు కేస్ విషయంలో లోకల్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కలిసినట్లు తెలుస్తోంది. ఆమె కూడా యాక్షన్ తీసుకుంటానని హామీ ఇచ్చారని చెబుతున్నారు. దీంతో ప్రీతి ఆత్మహత్య కేసు విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అతనిని వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు.