Minister Peddi Reddy : తిరుపతి(Tirupati) లో “మేమంతా సిద్దం” సమన్వయ సమావేశం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddi Reddy Ramachandra Reddy). వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో సిద్దం సభలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమన్వయ సమావేశంలో ఎమ్మేల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గం సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిద్దం సభ పోస్టర్ ఆవిష్కరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్దులు.
Also Read : వంగా గీతకు షాక్.. ప్రచారాన్ని అడ్డుకున్న ఎన్నికల అధికారులు..!
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు లేదా పూతలపట్టులో ఒక సభ, నాయుడుపేట లేదా శ్రీకాళహస్తిలో సభలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 21 సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 27 ప్రొద్దుటూరు, 28 నంద్యాల, 29 ఎమ్మిగనూరులో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read : టీడీపీ టార్గెట్ ఇదే.. అందుకే పొత్తులు పెట్టుకున్నాం : అచ్చెన్నాయుడు
ఇప్పటికే రాష్ట్రంలో 4 చోట్ల భారీగా సిద్దం సభ(Siddam Sabha) లు నిర్వహించామని వ్యాఖ్యానించారు. ఆ నాలుగు ప్రాంతాలు మినహాయించి మిగిలిన 21 జిల్లాలో సభలు జరుగుతాయన్నారు. సభలు విజయవంతం చేసేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సిద్దం సభలతో కార్యకర్తలు జోష్ లో ఉన్నారన్నారు.