5 Years Girl Child Killed : తమ చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ చిన్నపిల్లల్లో కూడా నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. దీనికి ఉదాహరణే ఢిల్లీ (Delhi) లో జరిగిన సంఘటన. దయాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిమ్ ఉల్ ఖురాన్ అనే మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం… 5 ఏళ్ల చిన్నారి రుహాన్ అపస్మారక స్థితిలో ఉన్నట్టు మదర్సా డైరెక్టర్ గమనించారు. దీంతో ఆయన పిల్లాడి తల్లికి ఫోన్ చేసి చిన్నారి ఆరోగ్యం గురించి తెలియజేశారు. తల్లి మదర్సాకు చేరుకుని రుహాన్‌ను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ డాక్టర్ చిన్నారిని పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో రుహాన్ తల్లిదండ్రులు, బంధువులు మదర్సా బయట నిరసనలు చేశారు.
ఆందోళనల గురించి తెలుసుకున్న పోలీసులు మదర్సాకు చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీన పరుచుకోవడంతో పాటూ… మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారభించారు. మరోవైపు రుహాన్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. ఇందులో చిన్నారి హత్యకు గురైనట్లు తెలిసింది. తర్వాత పోలీసులు మదర్సా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో తేలిందేమింటే..మదర్సాలో చదువుతున్న మరో ముగ్గురు చిన్నారులు రుహాన్ తో అసభ్యంగా ప్రవర్తించి హత్య చేసారు. విద్యార్ధి చనిపోతే మదర్సా (Madrasa) లో ఒకరోజు సెలవు ఉంటుందని, ఆ తర్వాత ఇంటికి వెళ్లవచ్చని వారు భావించి..రుహాన్‌ను హత్య చేశారు. ప్రస్తుతం నిందితలైన చిన్నారులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.
Also Read: Kolkata: హత్యకు ముందు కూడా మరో మహిళపై వేధింపులు..