Prabhas Spirit: ఇటీవలే విడుదలైన ప్రభాస్ కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రికార్డు వసూళ్లతో 1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ లిస్ట్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘స్పిరిట్’. సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. మూడు వందల కోట్ల పై బడ్జెట్ తో రూపొందనున్న ఈ హై బడ్జెట్సి నిమాను టి.సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘స్పిరిట్’ లో హాలీవుడ్ విలన్
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ గా నటించేందుకు హాలీవుడ్ స్టార్ ‘మా డాంగ్-సియోక్ ను’ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా మొదలయ్యాయని సమాచారం. అంతే కాదు సినిమాలోని యాక్షన్ స్టంట్స్ కోసం కొరియన్ స్టంట్ కొరియోగ్రాఫర్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ‘స్పిరిట్ కథ’ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండబోతుందట. అందుకే మేకర్స్ ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘మా డాంగ్-సియోక్’
మా డాంగ్-సియోక్ సౌత్ కొరియన్, హాలీవుడ్ సినిమాల్లో నటిస్తారు. ‘ట్రైన్ టు బుసన్’, ‘ది అవుట్లాస్’, ‘అన్‌స్టాపబుల్’, ‘ది కాప్’, ‘ది డెవిల్’, ‘ది గ్యాంగ్‌స్టర్’, ‘ఛాంపియన్’, ‘డిరైల్డ్’, ‘ది బ్యాడ్ గైస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో విలన్ గా నటించారు. యాక్షన్, మార్షల్ ఆర్ట్స్‌కు ప్రసిద్ధి చెందాడు డాంగ్-సియోక్.
View this post on Instagram
Also Read: Kalki 2898 AD: 1000 కోట్ల దిశగా.. బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి వసూళ్ళ సునామీ..! – Rtvlive.com