Lemon Tips : వేసవి కాలం(Summer Season) లో నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. విటమిన్-సి(Vitamin-C) అధికంగా ఉండే నిమ్మకాయలను సిరప్, ఫ్రూట్ చాట్, అనేక ఇతర తయారీలలో ఉపయోగిస్తారు. కావున ప్రజలు ఒకేసారి చాలా నిమ్మకాయలను మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. కానీ
తక్కువ సమయంలోనే వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోవడం వల్ల నిమ్మకాయలు పాడవడం గమనిస్తుంటాము. అయితే నిమ్మకాయలు ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండడానికి ఈ సింపుల్ చిట్కాలను(Simple Tips) పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
ఎయిర్ టైట్ కంటైనర్
నిమ్మకాయలను(Lemon) ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి, వాటిని ఫ్రీజర్లో ఉంచవచ్చు. కానీ నిమ్మకాయలను ఫ్రీజర్లో ఉంచితే త్వరగా ఎండిపోతాయని గుర్తుంచుకోండి. అందువల్ల, వాటిని ఎల్లప్పుడూ ఎయిర్ టైట్ కంటైనర్ లేదా జిప్ లాక్ బ్యాగ్లో ఉంచాలి. ఈ విధంగా చేస్తే ఒక వారం పాటు నిమ్మకాయలు ఫ్రెష్ గా ఉంటాయి.
చేతి రుమాలులో
నిమ్మకాయలను ఒక మెత్తటి చేతి రుమాలులో చుట్టవచ్చు.ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేనివారు ఈ పద్ధతిని ఉపయోగించండి. ఇందుకోసం ముందుగా నిమ్మకాయను బాగా కడగాలి. తరువాత శుభ్రమైన, పొడి కాటన్ చేతి రుమాలు తీసుకొని నిమ్మకాయలను ఈ చేతి రుమాలులో చుట్టాలి. ఇప్పుడు వాటిని చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచండి. ఈ విధంగా నిమ్మకాయలు వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి.
న్యూస్ పేపర్స్
న్యూస్ పేపర్స్ అన్ని నిమ్మకాయలను విడిగా చుట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో ప్యాక్ చేయండి.
నిమ్మరసం
నిమ్మరసం రూపంలో లో కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా నిమ్మకాయల నుంచి రసాన్ని తీయాలి. తర్వాత ఆ రసాన్ని ఐస్ ట్రేలో నింపి ఫ్రీజ్ చేయాలి. అవసరమైనప్పుడు వాడాలి ఒక ముక్క తీసి కలుపుకుంటే సరిపోతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Sabja Seeds: సబ్జా గింజలను ఇలా తీసుకుంటే ఆ సమస్యలన్నీ దూరం – Rtvlive.com