New SIM Card Rule For New Users : వచ్చే ఏడాది మొదటి రోజు నుంచి కూడా సిమ్ కార్డు (SIM Card)ల విషయంలో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు సిమ్ కార్డులను తీసుకోవాలంటే కేవైసీ వెరిఫికేషన్ పేపర్ సంబంధించి ఉండేది..ఇక నుంచి ఆ పద్దతిని నిలిపివేస్తున్నట్లు టెలికాం విభాగం (Telecom Department)పేర్కొంది. పేపర్ బదులు డిజిటల్ వెరిఫికేషన్ తీసుకుని వస్తున్నట్లు వివరించింది.
ఈ విధానాన్ని గురించి ఎయిర్టెల్, జియో, వొడాఫోన్, ఐడియా కంపెనీలు సంతోషం తెలిపాయి.
ఇలా చేయడం వల్ల సిమ్ కార్డు మోసాలను సైతం ఆరికట్టొచ్చని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం సిమ్ కార్డుల జారీకి ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.
దీనికి ఆ వ్యక్తికి సంబంధించిన గుర్తింపు పత్రాలు, ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే కొన్ని కంపెనీలు డిజిటల్ విధానాన్ని పాటిస్తున్నాయి. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని పాటిస్తూ ..పేపర్ విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు టెలికాం విభాగం తెలిపింది.
డాట్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల టెలికాం కంపెనీలకు మేలు జరగనుంది. పేపర్ లేస్ విధానం వల్ల కస్టమర్ ను చేర్చుకునేందుకు కంపెనీలకు ఖర్చు తగ్గుతుందని కంపెనీలు చెప్తున్నాయి. ఇక నుంచి కంపెనీలు అన్ని కూడా పూర్తిగా మొబైల్ తోనే ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది.
సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను ఆరికట్టేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న కొన్ని చర్యల్లో భాగంగా కొత్తగా ఈ డిజిటల్ విధానాన్ని తీసుకుని వచ్చింది.
Also read: జనశతాబ్ది ఎక్స్ప్రెస్ బోగీలో మంటలు