Kumari Aunty in Zee Telugu Serial : ఇటీవలే కాలంలో సోషల్ మీడియా(Social Media) లో బాగా ట్రెండ్ అయిన పేరు కుమారి ఆంటీ(Kumari Aunty). స్ట్రీట్ ఫుడ్ బిజినెస్(Street Food Business) రన్ చేస్తున్న కుమారీ ఆంటీ సోషల్ మీడియా పుణ్యమాని సెలెబ్రెటీలా మారిపోయింది. 5 కేజీల రైస్ తో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఈమె.. ఇప్పుడు 100 కేజీల ఫుడ్ సర్వ్ చేసే స్థాయికి ఎదిగిపోయింది. ఇక్కడ భోజనం చేసిన వాళ్లు.. వీడియోలు తీసి పోస్ట్ చేయడంతో కుమారీ ఆంటీ బిజినెస్ మరింత పాపులరైంది. పలు టీవీ ఛానెల్స్(TV Channels), యూట్యూబ్ ఛానెల్స్(YouTube Channels) ఈమెను ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టారు.
ఇలా సోషల్ మీడియాలో ఫుల్ ఫెమసైన కుమారీ ఆంటీ.. పలు టీవీ షోస్, ఈవెంట్స్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేశారు. తెలుగులో ప్రసారమైన ప్రముఖ షోలన్నింటిలోనూ కనిపించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.
సీరియల్స్ లో అడుగుపెట్టిన కుమారి ఆంటీ
అయితే ఇప్పటి వరకు టీవీ షోస్ లో మాత్రమే సందడి చేసిన కుమారి ఆంటీ.. తాజాగా సీరియల్స్ లో కూడా అడుగుపెట్టారు. జీ తెలుగు ఛానెల్(Zee Telugu Channel) లో ప్రసారమవుతున్న ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ సీరియల్ లో(Rajeshwari Vilas Coffee Club) గెస్ట్ రోల్ లో కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇది చూసిన నెటిజన్లు కుమారీ ఆంటీ క్రేజ్ మాములుగా లేదు కదా.. అప్పుడే సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక నెక్స్ట్ సినిమాల్లోకే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆ మధ్యలో కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ముందు భారీ ట్రాఫిక్ ఏర్పడడంతో.. పోలీసులు ఫుడ్ స్టాల్ క్లోజ్ చేయడం జరిగింది. దీని పై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. తిరిగి ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయాలని ఆదేశించారు. దీంతో ఈమె మరింత పాపులర్ అయ్యింది.
Also Read : Vaishnavi Chaitanya: పూట గడవడం కోసం అలా చేశా.. కన్నీళ్లు తెప్పిస్తున్న బేబీ హీరోయిన్ మాటలు