Actress Kriti Shetty Interview : అందాల భామ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. పలు స్టార్ హీరోలు, కుర్ర హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుపోయింది. ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్, నాగ చైతన్య బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.
అప్పటి వరకు వరుస హిట్లతో వెలిగిపోయిన ఈ అమ్మడు.. గత రెండేళ్ల నుంచి బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ అందుకుంది. దీంతో ఈ హీరోయిన్ కి ఆఫర్స్ అమాంతం తగ్గిపోయాయి. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత ‘మనమే’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా జూన్ 7 న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో తాను రిలేషన్ లో ఉన్నట్లు చెప్పి షాకిచ్చింది.
Also Read : తండ్రి అయిన బాలీవుడ్ స్టార్ హీరో..!
నేను సింగిల్ కాదు..
తాజా ఇంటర్వ్యూలో మీరు సింగిలా? రిలేషన్ లో ఉన్నారా? అని అడిగితే.. ” నేను సింగిల్ కాదు. రిలేషన్లోనే ఉన్నా.. నా పనితో రిలేషన్లో ఉన్నా అంటూ నవ్వులు పూయించేసింది. ఇక కాబోయేవాడు ఎలావుండాలి? అని అడిగితే, మంచివాడై ఉండాలని, నిజాయితీపరుడై ఉండాలని, సాటివారిపై దయ కలిగినవాడై ఉండాలి” అంటూ చెప్పింది. దీంతో కృతి శెట్టి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.