Bharateeyudu 2: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. 1996 లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన మూవీ ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘భారతీయుడు 2’
ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘భారతీయుడు 2’ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్టు కొన్ని సూచనలతో ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ మూవీ ఏకంగా 3 గంటల 10 నిమిషాల రన్ టైం కలిగి ఉంది. సహజంగా 2 గంటల నిడివి ఉన్న సినిమాలే కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులకు బోర్ కలిగిస్తాయి. ఇక ఇంత రన్ టైం ఉన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే మంచి కథ, కాన్సెప్ట్ తప్పనిసరి. ఈ విషయంలో దర్శకుడు శంకర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. భారతీయుడు 2 చాలా అద్భుతంగా ఉండబోతుందని తెలిపారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం జులై 12న విడుదల కానుంది. ‘ఇండియన్ 2’ లో స్టార్ కాస్ట్ సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని, నేదురుమూడి వేణు, ఢిల్లీ గణేష్, మనోబాల, జగన్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, జాకీర్ హుస్సేన్, పీయూష్ మిశ్రా అఖిలేంద్ర మిశ్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: Samantha: ‘ముందు మాట్లాడడం నేర్చుకో.. ‘ డాక్టర్ కు సమంత కౌంటర్ – Rtvlive.com