Kajal Agarwal Shocking Comments On South Industry : ఓ ఇండస్ట్రీలో హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకొని ఆ తర్వాత కొన్నాళ్లకు ఛాన్సులు రాకపోతే అదే ఇండస్ట్రీపై విమర్శలు చేయడం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. ఇలియానా, పూజా హెగ్డే, తాప్సి లాంటి హీరోయిన్స్ గతంలో సౌత్ ఇండస్ట్రీ పై ఇలాంటి విమర్శలే చేశారు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో మన అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ సౌత్ ఇండస్ట్రీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
పెళ్ళయితే పట్టించుకోరు…
‘లక్ష్మీ కళ్యాణం’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్.. ‘మగధీర’ మూవీతో స్టార్ స్టేటస్ అందుకుంది. అక్కడి నుంచి టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి చాలా ఏళ్ళ పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. అలంటి టైం లోనే బిజినెస్ అయిన గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. రీసెంట్ గా ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇక పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తోంది. తాజాగా ఈమె నటించిన ‘సత్యభామ’ మూవీ జూన్ 7 న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
Also Read : 500 మంది డ్యాన్సర్లతో ‘పుష్ప’ 2 సాంగ్.. ఆసక్తికర విషయాలు పంచుకున్న కొరియోగ్రాఫర్!
” బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీ మధ్య చాలా తేడా ఉంది. దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్లని బాగా లేరని పక్కన పెట్టేస్తారు. అదే హిందీలో మాత్రం పెళ్లయినా సరే హీరోయిన్లుగా నటిస్తుంటారు. షర్మిళా ఠాకుర్, హేమమాలిని మొదలుకొని దీపికా పదుకొణె, ఆలియా భట్ లాంటి వాళ్లకు హీరోయిన్లుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ దక్షిణాదిలో అలాంటి పరిస్థితి లేదు. దీనికి నయనతార అతీతం. ఆమె మంచి సినిమాలు చేస్తోంది. దక్షిణాదిలో నెలకొన్న ఈ పరిస్థితిని త్వరలోనే మారుద్దాం” అంటూ చెప్పుకొచ్చింది.