UNHRC: ప్రతిసారీ అవమానాలకు గురవుతున్నప్పటికీ, పాకిస్తాన్ తన నీచ కార్యకలాపాలను మాత్రం మానుకోవడం లేదు. ఈసారి పాకిస్తాన్, టర్కీతో కలిసి ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఉగ్రవాదంలో తన పరాక్రమం కారణంగా ‘పాక్’కు భారత వీర వనిత తగిన సమాధానం ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) 55వ రెగ్యులర్ సెషన్లో ‘ప్రత్యుత్తర హక్కు’ని ఉపయోగించి జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌లో మొదటి సెక్రటరీ అనుపమా సింగ్, పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధిచెప్పింది.
కశ్మీర్ అంశం అనేది భారతదేశ అంతర్గత విషయం. భారత్ కు సంబంధించిన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు పాకిస్తాన్ కు లేదంటూ గట్టిగా గడ్డిపెట్టింది. మీ చేతులు నెత్తుటి రక్తంతో తడిసిపోయాయి…మీరా మాకు చెప్పేది అంటూ లేడీ సింగం గర్జించండంతో యూఎన్ హెచ్ఆర్సీలో పాక్ వణికిపోయింది. పాకిస్థాన్‌కు ధీటుగా సమాధానం చెప్పిన అనుపమ సింగ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ అనుపమ సింగ్ ఎవరో తెలుసుకుందాం?
🇮🇳 India exercises Right of Reply at #HRC55, First Secretary Anupama Singh, says, “The entire Union Territories of Jammu and Kashmir and Ladakh is an integral and inalienable part of India”.pic.twitter.com/vk6wXezfOO
— All India Radio News (@airnewsalerts) February 29, 2024
భారత వీర వనిత గురించి:
-అనుపమ సింగ్ 2014 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి.
-ఐఎఫ్ఎస్ అధికారిణి అనుపమ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు. అంతకుముందు, ఆమె మౌలానా ఆజాద్ నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో బి.టెక్ డిగ్రీని పొందారు.
-ప్రస్తుతం అనుపమ సింగ్ ఐక్యరాజ్యసమితికి భారతదేశ శాశ్వత మిషన్‌లో మొదటి కార్యదర్శిగా ఉన్నారు. 2014 నుండి, ఆమె ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో దౌత్యవేత్త.
-దీనికి ముందు అనుపమ సింగ్ కెపిఎంజిలో రెండేళ్ల మూడు నెలలు పనిచేసింది. జూలై 2012లో సలహాదారుగా నియమితులయ్యారు. అక్టోబర్ 2013 నుండి సెప్టెంబర్ 2014 వరకు, ఆమె సీనియర్ సలహాదారుగా పనిచేశారు.
అనుపమ సింగ్ మొదట టర్కీ చేసిన వ్యాఖ్యపై విచారం వ్యక్తం చేశారు. కాశ్మీర్ భారతదేశ అంతర్గత విషయమని స్పష్టం చేశారు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ లేడీ సింగం గురించి ఇప్పుడు నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.భారత్ జోలికి వస్తే ఏమౌతుందో మాటలతో పాకిస్తాన్ ను వణించిన ఆ వీర వనిత గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు.